Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచు విష్ణు ద్విభాషా చిత్రం ఫిలిమ్ షురూ!

"ఈడోరకం ఆడోరకం"తో సూపర్ హిట్ అందుకొని సూపర్ ఫామ్‌లో ఉన్న మంచు విష్ణు ఇప్పుడు తమిళ చిత్రసీమలో అడుగిడనున్నాడు. రామా రీల్స్ సంస్థ నిర్మాణంలో రూపొందనున్న తాజా చిత్రం తమిళ - తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్

Advertiesment
Manchu Vishnu New Movie Bilingual Launched
, శుక్రవారం, 20 జనవరి 2017 (10:51 IST)
"ఈడోరకం ఆడోరకం"తో సూపర్ హిట్ అందుకొని సూపర్ ఫామ్‌లో ఉన్న మంచు విష్ణు ఇప్పుడు తమిళ చిత్రసీమలో అడుగిడనున్నాడు. రామా రీల్స్ సంస్థ నిర్మాణంలో రూపొందనున్న తాజా చిత్రం తమిళ - తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. మంచు విష్ణు సరసన సురభి కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి జి.ఎస్.కార్తీక్ దర్శకుడు. ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (జనవరి 19) లాంఛనంగా జరిగింది. 
 
దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పద్మశ్రీ మోహన్ బాబు క్లాప్ కొట్టగా.. సీనియర్ సంగీత దర్శకులు కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జాన్ సుధీర్ పూదోట మాట్లాడుతూ.. "మోహన్ బాబు, కీరవాణి, విజయేంద్రప్రసాద్ వంటి ప్రముఖులు మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. 
 
మా బ్యానర్‌లో రూపొందుతున్న 5వ సినిమా ఇది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ స్వరసారథ్యం వహించనున్న ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. యూనివర్సెల్ కాన్సెప్ట్ కావడంతో ద్విభాషా సినిమాగా రూపొందిస్తున్నాం. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది" అన్నారు. 
 
సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: సుధీర్ కుమార్ పూదోట (జాన్), కథ-చిత్రానువాదం-దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫుల్ రొమాన్స్ చిత్రంగా "ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు"