ఫుల్ రొమాన్స్ చిత్రంగా "ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు"
ప్రశాంత్ మహీధర్ లలిత ఇషితా హీరో హీరోయిన్లుగా బేబీ ఆముక్త సమర్పణలో ప్రశ్నార్ద్ తాతా నిర్మాతగా వెంకటేష్.కె దర్శకత్వంలో యూత్‌ఫుల్ రొమాంటిక్ స్పైసీ ఎంటర్‌టైనర్ ఇప్పటిలో "రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు" ఈ
ప్రశాంత్ మహీధర్ లలిత ఇషితా హీరో హీరోయిన్లుగా బేబీ ఆముక్త సమర్పణలో ప్రశ్నార్ద్ తాతా నిర్మాతగా వెంకటేష్.కె దర్శకత్వంలో యూత్‌ఫుల్ రొమాంటిక్ స్పైసీ ఎంటర్‌టైనర్ ఇప్పటిలో "రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు" ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ చిత్రంలో పతాకస్థాయిలో రొమాన్స్ ఉన్న కారణంగా "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాను దర్శకుడు పూర్తి స్థాయిలో రొమాన్స్ సన్నివేశాలతో నింపినట్టు తెలుస్తుంది.
ఈ మూవీ స్టిల్స్ చూస్తేనే శృంగారం పతాక స్థాయిలో చిత్రీకరించినట్లుగా అర్థమవుతుంది. ఇది యూత్‌ని టార్గెట్ చేస్తూ సినిమా అంతా రొమాన్స్ శృంగారంతో తీసినట్టు ఉంది. ఇలాంటి ఫుల్‌లెన్త్ శృంగార భరిత చిత్రం తెలుగులో రావటం ఇదే మొదటి సారిలా ఉంది. ఇలాంటి చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ "ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు" సినిమా మంచి విందు భోజనం లాంటిది. స్టిల్సే ఈ విధంగా ఉంటే త్వరలో రాబోయే చిత్రం ఏ స్థాయిలో ఉంటుందోనని ఆసక్తి రేపుతోంది.