Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూపర్ స్టార్ మహేష్ బాబు డాంగ్ డాంగ్ ప్రొమో

Advertiesment
సూపర్ స్టార్ మహేష్ బాబు డాంగ్ డాంగ్ ప్రొమో
, శనివారం, 28 డిశెంబరు 2019 (17:20 IST)
సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. 
 
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్ప‌టికే విడుదలైన టీజర్‌, మాస్‌ సాంగ్‌, మెలొడి సాంగ్, రొమాంటిక్ సాంగ్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా ఈ చిత్రం నుండి అంద‌రూ ఎదురు చూస్తున్న ’సరిలేరు నీకెవ్వరు’ డాంగ్ డాంగ్ ప్రొమో సాంగ్ ఈరోజు సాయంత్రం విడుదల కాబోతోంది. 
 
మరోవైపు జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైద‌రాబాద్ లాల్‌బహదూర్‌ స్టేడియంలో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్‌ ఈవెంట్`ను నిర్వహించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌ చేయ‌నున్నవిష‌యం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ ‘దర్బార్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్.. ఆ పాట ట్రెండింగ్