Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుబోధ్ భావే తో ఆదిత్య ఓం తెరకెక్కించిన సంత్ తుకారాం సిద్ధమైంది

Advertiesment
Subodh Bhave As tukaram

దేవీ

, మంగళవారం, 15 జులై 2025 (17:35 IST)
Subodh Bhave As tukaram
ఆదిత్య ఓం దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా ఎన్ని రకాల ప్రయోగాల్ని చేస్తూ ఉన్నారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ‘సంత్ తుకారం’ అంటూ దర్శకుడిగా రాబోతోన్నారు. 17వ శతాబ్దపు మరాఠీ సాధువు-కవి భక్తిని ప్రతిఘటనగా మార్చిన సంత్ తుకారాం జీవితం, వారసత్వం, సాహిత్య విప్లవం ఆధారంగా ఆదిత్య ఓం ఈ ‘సంత్ తుకారం’ చిత్రాన్ని రూపొందించారు.

ఈ చిత్రంలో ప్రముఖ మరాఠీ నటుడు సుబోధ్ భావే టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. మరాఠీ, హిందీ సినిమాల్లో భావే తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించారు. ఇక ఇప్పుడు 17వ శతాబ్దపు సాధువైన సంత్ తుకారం పాత్రలో మెప్పించబోతోన్నారు. ఈ చిత్రం జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.
 
ఈ చిత్రంలో శివ సూర్యవంశీ, షీనా చోహన్, సంజయ్ మిశ్రా, అరుణ్ గోవిల్, శిశిర్ శర్మ, హేమంత్ పాండే, గణేష్ యాదవ్, లలిత్ తివారీ, ముఖేష్ భట్, గౌరీ శంకర్, ట్వింకిల్ కపూర్, రూపాలి జాదవ్, DJ అక్బర్ సామి వంటి ప్రఖ్యాత నటులు కీలక పాత్రలకు జీవం పోశారు. ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకి హైలెట్ కానుంది.
 
నిఖిల్ కామత్, రవి త్రిపాఠి, వీరల్, లావన్ స్వరపరిచిన పాటలు అందరినీ ఆకట్టుకోనున్నాయి. శాస్త్రీయ, జానపద, భక్తి  భావాల్ని కలిగించేలా పాటలు ఉండనన్నాయి. ప్రతి పాట తుకారాం పాత్ర భావోద్వేగ, తాత్విక పరిణామాన్ని ప్రతిధ్వనిస్తుంది. పురుషోత్తం స్టూడియోస్‌తో కలిసి బి. గౌతమ్‌కు చెందిన కర్జన్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం పాన్-ఇండియా వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?