Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణాది దృష్టంతా కలెక్షన్ నంబర్లపైనే : సంజయ్ దత్

Advertiesment
sanjay dutt

ఠాగూర్

, శుక్రవారం, 11 జులై 2025 (16:31 IST)
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ దక్షిణాది సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఇండియన్ మూవీస్‌లో మంచి సినిమాలు చేసి వాటిని బాలీవుడ్‌కు తీసుకెళ్లాలన్న తపన ఉందన్నారు. శుక్రవారం నగరంలో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచి సినిమాలు చేయాలనే ఫ్యాషన్‌ను సౌత్ నుంచి బాలీవుడ్‌కు తీసుకెళతానని చెప్పారు. 
 
గతంలో బాలీవుడ్‌‍కి కూడా మంచి సినిమాలపై ఫ్యాషన్ ఉండేదన్నారు. ఇపుడు పరిస్థితి మారిపోయిందన్నారు. ఇపుడు ప్రతి ఒక్కరూ కలెక్షన్లు, నంబర్లపైనే దృష్టిసారిస్తున్నారని చెప్పారు. దక్షిణాదిలో ఆ ఫ్యాషన్ ఇప్పటికీ ఉందని చెప్పారు. అందుకే తనకు సౌత్ సినిమాలలో నటించడం సంతోషంగా ఉందని చెప్పారు. కన్నడలో ధృవ్ సర్జా హీరోగా నటించిన కేడీ ది డెవిల్ మూవీలో సంజయ్ దత్ శిల్పాశెట్టి, రమేష్ అరవింద్ తదితరులు నించారు. ఈ సినిమా టీజర్‌ ఈ రోజు విడుదల చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుహాస్‌, ఓ భామ అయ్యో రామ మూవీ రివ్యూ