Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమైన సందిగ్ధం

Advertiesment
Nihal, Priya Deshpaag
Nihal, Priya Deshpaag
డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ‘సందిగ్ధం’ టీం రెడీ అవుతోంది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ మూవీకి పార్థసారధి కొమ్మోజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని తీర్థ క్రియేషన్స్ బ్యానర్ మీద సంధ్య తిరువీధుల నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక త్వరలోనే వరుస అప్డేట్లతో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయబోతున్నారు.
 
ప్రస్తుతం ‘సందిగ్ధం’ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే వరుసగా అప్డేట్లను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
 
ఈ చిత్రానికి గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి నందన్ కృష్ణ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ కోచెర్ల, నవీన్ రాజ్ సంకరపు, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి, దుర్గ, శ్రీదేవీ, లక్ష్మణ్ రావు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mark K Robin: గద్దర్ పాటలు కాదు ఫైర్ - ఆయన పేరుతో అవార్డు రావడం ఆనందంగా వుంది : మార్క్ కె రాబిన్