ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై సినీ నటి కస్తూరి ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ అంటే పెద్దరికం అంటూ కితాబిచ్చారు. అల్లు అర్జున్‌పై కేసు, అరెస్టు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన ఇత్యాది అంశాలపై పవన్ కళ్యాణ్ సోమవారం మీడియాతో జరిగిన ఇష్టాగోష్టితో స్పందించారు.
దీనిపై సినీ నటి కస్తూరి స్పందిస్తూ, పెద్దరికం అంటే పవన్. ఎంతో ఖచ్చితత్వంతో, పరిణితితో కూడిన ప్రకటన చేశారు. ఎక్కడా పక్షపాతం లేదు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఓ మహిళాభిమాని ప్రాణాలు కోల్పోయగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ అంశంపై పవన్ లేదా మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరూ స్పందించలేదు.