Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొబ్బరిమట్ట హిట్ కోసం భద్రకాళిని దర్శించుకున్న సంపూర్ణేష్ బాబు!

కొబ్బరిమట్ట సినిమా విజయవంతం కావాలని కోరుతూ టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా తనకు ఆనందంగా ఉందని.. తెలుగులో తనకు

Advertiesment
Sampoornesh Babu visits Warangal Bhadrakali Temple
, బుధవారం, 6 జులై 2016 (14:30 IST)
కొబ్బరిమట్ట సినిమా విజయవంతం కావాలని కోరుతూ టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా తనకు ఆనందంగా ఉందని.. తెలుగులో తనకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. కొబ్బరిమట్ట సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని.. ఇప్పటికే ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో హ్యాపీగా ఉన్నట్లు వెల్లడించారు. అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు సంపూర్ణేష్ ఆకాంక్షించారు.
 
సంపూర్ణేష్ బాబు, గాయత్రి, గీతాంజలి ప్రధాన పాత్రల్లో గుడ్ సినిమా గ్రూప్, అమృత ప్రొడక్షన్స్, సంజనా మూవీస్ సంయుక్తంగా, రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో, సాయి రాజేష్ నీలం, ఆది కుంభగిరి నిర్మాతలుగా నిర్మిస్తున్న కొబ్బరిమట్ట చిత్రం టీజర్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆవిష్కరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రేట్ గ్రాండ్ మస్తీ, ఉడ్తా పంజాబ్ తరహాలో ''సుల్తాన్''కు కష్టాలు... రిలీజ్ కాకముందే ఆన్‌లైన్‌లో లీక్!!