Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రేట్ గ్రాండ్ మస్తీ, ఉడ్తా పంజాబ్ తరహాలో ''సుల్తాన్''కు కష్టాలు... రిలీజ్ కాకముందే ఆన్‌లైన్‌లో లీక్!!

మొన్నటికి మొన్నవివేక్ ఒబరాయ్, రితేష్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన ''గ్రేట్ గ్రాండ్ మస్తీ'' రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో వచ్చేసి నిర్మాతలకు భారీ నష్టాన్ని తెచ్చి పెట్టింది. ఈ విషయాన్ని మరువక ముందే

Advertiesment
Udta Punjab
, బుధవారం, 6 జులై 2016 (13:26 IST)
మొన్నటికి మొన్నవివేక్ ఒబరాయ్, రితేష్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన ''గ్రేట్ గ్రాండ్ మస్తీ'' రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో వచ్చేసి నిర్మాతలకు భారీ నష్టాన్ని తెచ్చి పెట్టింది. ఈ విషయాన్ని మరువక ముందే బాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీగా పేరు తెచ్చుకున్న ''ఉడ్తా పంజాబ్'' రిలీజ్‌కు ముందే టోరండ్జ్‌లో విడుదలైంది. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కేవలం ఇండియాలోనే ఈ చిత్రం 4500 థియేటర్లలో విడుదలై సరికొత్త రికార్డు సృష్టించింది. 
 
అలీ అబ్బాస్ జాఫర్ రూపొందించిన ఈ చిత్రంలో సల్మాన్ సరసన అనుష్క శర్మ కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నిర్మాతలకు ఆందోళన కలిగిస్తుంది."సుల్తాన్'' చిత్రం రిలీజ్ అయి కొన్ని గంటలు గడువకముందే, ఈ చిత్రం ఆన్‌లైన్‌లో విడుదలై చక్కర్లు కొడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన యూనిట్ సభ్యులు లింకులను డిలీట్ చేసే పనులలో ముమ్మరంగా ఉన్నారట.
 
ఈ విషయాన్ని ముంబై సైబర్ క్రైం ఎక్స్‌పర్ట్స్ ధృవీకరించారు. ఇప్పటికే నష్ట నివారణా చర్యలు చేపట్టిన చిత్ర యూనిట్ పలు వెబ్ సైట్స్ బ్లాక్ చేయిస్తున్నప్పటికీ.. ఇప్పటికే పరిస్థితి చేయి జారిపోయినట్టుందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఒక రకంగా ఈ చిత్రానికి కొన్ని కోట్ల మేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కూల్లో విద్యార్థులకు ఖురాన్ నేర్పిస్తే.. విపత్కర పరిస్థితి ఎదురైనా..?: రామ్ గోపాల్ వర్మ