Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాత్రల్లాగే పేరు ప్రతిష్టలూ కల్పనే.. శాశ్వతమనుకుంటే అడ్రస్ లేకుండా పోతారు: సమంత

సినీరంగంలో ఒకటి రెండు వరుస విజయాలు లబిస్తే పేరూ ప్రతిష్టలూ వాటంతటవే వస్తాయనీ, అయితే ఎంత త్వరగా వస్తాయో అంతే త్వరగా అవి మాయమైపోతాయని, ఎందుకంటే సినిమాల్లో పాత్రల్లాగే కీర్తికిరీటాలూ కల్పనే అని పచ్చి నిజ

Advertiesment
Samantha
హైదరాబాద్ , గురువారం, 9 మార్చి 2017 (05:55 IST)
సినీరంగంలో ఒకటి రెండు వరుస విజయాలు లబిస్తే పేరూ ప్రతిష్టలూ వాటంతటవే వస్తాయనీ, అయితే ఎంత త్వరగా వస్తాయో అంతే త్వరగా అవి మాయమైపోతాయని, ఎందుకంటే సినిమాల్లో పాత్రల్లాగే కీర్తికిరీటాలూ కల్పనే అని పచ్చి నిజాలు చెబుతున్నారు సమంత. ఇక్కడ పేరు, ప్రఖ్యాతులు త్వరగా లభిస్తాయి. అయితే సినిమాలో అందిన పేరు ప్రఖ్యాతులు నిరంతరం అని భావించరాదు. సినిమాలో పాత్రలు ఎలాగయితే కల్పనో అవీ అంతే. ఆ విషయాన్ని మనసులో ఉంచుకునే సినిమాలో నా స్థాయి గురించి ఆలోచించను. ఇతర తారలు ఈ విషయాన్ని గుర్తెరిగి మెలిగితే మంచిది అని హెచ్చరిస్తున్నారామె.
 
 
పక్కపక్కనే ఉన్న అక్షరాలు కలుసుకోవడానికి పాతికేళ్లు పట్టింది అనే ఒక్క డైలాగుతూ ప్రేక్షకులను ఎక్కడికో తీసుకెళ్లిన సమంత పేరు ప్రఖ్యాతులు నిరంతరం కాదు అంటున్నారు. సినిమా తారలందరూ నిజాలు చెబుతారని చెప్పలేం. అయితే కేరళ చిన్నది సమంత నిజాయితీ అన్న పెద్ద పదాలు వాడకపోయినా తన మనసులోని భావాలను నిర్మొహమాటంగా, సూటిగా మాట్లాడతారని చెప్పవచ్చు. నటుడు నాగచైతన్యతో తన ప్రేమ విషయాన్ని కూడా ఆదిలోనే బహిరంగపరచిన నటి సమంత. ఈ అమ్మడేమంటున్నారో ఒక లుక్కేద్దామా ‘జీవితం అర్ధవంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఉన్నతస్థాయికి చేరుకుంటారని చెప్పలేం.
 
అయితే సాధించాలన్న లక్ష్యం మాత్రం ఉండాలి. కృషి, శ్రమ, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. నటిగా నేనీస్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదు. అయితే అలాంటి కోరిక మాత్రం ఉండేది. అందుకు శ్రమించాను. ఆశించిన స్థాయిని అందుకున్నాను. మొదటి చిత్రం విజయం సాధించినా చాలా మంది నటీమణులు ఆ తరువాత కనిపించకుండా పోతున్నారు. నా తొలి చిత్రం విజయం సాధించింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు అందివచ్చాయి. అన్ని చిత్రాలు ప్రజాదరణ పొందడంతో నేనూ నటిగా ఉన్నత స్థాయికి చేరుకున్నాను. త్వరలో వివాహం చేసుకోనున్నాను.  ఆ తరువాత కూడా నటిస్తారాఅని అడుగుతున్నారు. ఎందుకు నటించకూడదు. ఇతర రంగాల్లో  మహిళలు వివాహనంతరం తమ వృత్తులు చేసుకోవడం లేదా మేమూ అంతే. నేను పెళ్లి తరువాత కూడా నటిస్తాను. సినిమాలో ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో శ్రమించాను అంటున్న సమంతకు వివాహానంతరం కూడా మంచే జరగాలని కోరుకుందాం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ఫేస్‌బుక్ కూడా హ్యాక్ అయిందోచ్ అంటున్న మడోన్నా.. మళ్లీ వణుకుతున్న తారలూ, సెలబ్రిటీలు