Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా ఫేస్‌బుక్ కూడా హ్యాక్ అయిందోచ్ అంటున్న మడోన్నా.. మళ్లీ వణుకుతున్న తారలూ, సెలబ్రిటీలు

ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని ఏవరైనా చెబితో మామూలుగా తీసుకునే రోజులు పోయాయి. అందులోనూ సెలబ్రిటీలు అలా ప్రకటించారంటే ఇక ఎవరి కొంప మునగనుంది బాబో అంటూ వణుకుతూ కూర్చునే రోజులు వచ్చేశాయి

Advertiesment
నా ఫేస్‌బుక్ కూడా హ్యాక్ అయిందోచ్ అంటున్న మడోన్నా.. మళ్లీ వణుకుతున్న తారలూ,  సెలబ్రిటీలు
హైదరాబాద్ , గురువారం, 9 మార్చి 2017 (05:31 IST)
ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని ఏవరైనా చెబితో మామూలుగా తీసుకునే రోజులు పోయాయి. అందులోనూ సెలబ్రిటీలు అలా ప్రకటించారంటే  ఇక ఎవరి కొంప మునగనుంది బాబో అంటూ వణుకుతూ కూర్చునే రోజులు వచ్చేశాయి. ఇదంతా గాయని సుచిత్ర మహిమ. ఒక్క రోజులో ఆమె నటీనటుల పాలిట భూతమై  కూర్చుంద. తిక్కరేగితే చాలు ఎవరో ఒకరి న్యూడ్ ఫోటో, లేక చుంబన దృశ్యమో, ఒక గాఢ పరిష్వంగమో.. సినీతారలను, సెలెబ్రిటీలను సుచిత్ర పచ్చిగా చెప్పాలంటే సెక్స్‌తో కొడుతోందిప్పుడు. దాని ముద్దుపేరు ఫేస్ బుక్ హ్యాక్. ఇప్పుడు మరో ప్రముఖ హీరోయిన్ అదే రాగం ఆలపిస్తుండటంతో ఎవరి కొంప మునగనుందో అంటూ అందరూ హడలి చస్తున్నారు. పైగా ఈమె కూడా తన పేజీలో వచ్చే ఫోటోలను, పోస్టులను కొంత కాలం వరకు పట్టించుకోవద్దని ముందే హెచ్చరించింది కూడా.
 
మొన్న త్రిష, నిన్న సింగర్ సుచిత్ర, నేడు యువనటి మడోన్నా సెబాస్టియన్ సేమ్ సీన్ రిపీట్. ఇటీవలే తన ట్విటర్‌ అకౌంట్‌ను హ్యాక్ చేశారంటూ త్రిష ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సుచీలీక్స్ పేరుతో వరుసగా కోలీవుడ్ సీక్రెట్లన్నీ బయటపెడుతున్న గాయని సుచిత్ర కూడా తన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని పేర్కొన్న సంగతి తెలిసిందే.
 
నాగచైతన్య ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మళయాల ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్ కూడా తన ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయిందని తెలిపింది. తన ఎఫ్‌బీ ఖాతా హ్యాక్ చేశారన్న మడోన్నా తాను మళ్లీ ప్రకటించేవరకు ఫేస్‌బుక్ పేజ్ నుంచి వచ్చే పోస్టులు లేదా ఫోటోలను పట్టించుకోవద్దని అభిమానులకు సూచించింది. ఇది ఇబ్బంది కలిగించే పరిణామమే అయినా తప్పదని పేర్కొంది. 
 
దీంతో సినీ నటుల షోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేయడంపై మరోసారి సినీ పరిశ్రమల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరినీ వదలనంటుంది. అతడే టార్గెట్ అవుతున్నాడు.. సుచీలీక్స్ లక్ష్యం ఏమిటి?