Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాకుంతలం కోసం అన్నపూర్ణకు సమంత

Advertiesment
శాకుంతలం కోసం అన్నపూర్ణకు సమంత
, గురువారం, 25 నవంబరు 2021 (15:51 IST)
విడాకులు తీసుకున్న తర్వాత సమంత అన్నపూర్ణ స్టూడియో కాంపౌండ్‌‌లో అడుగుపెట్టింది. ఈ జంటను చూసి చాలామంది చూడ చక్కని జంట అంటూ కితాబిచ్చారు. కానీ వున్నట్టుండి ఏమైందో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది షాక్‌కు గురయ్యారు. మొదట్ల ఎవ్వరు నమ్మలేదు కానీ ఆ తర్వాత వీరిద్దరూ తమ విడాకులు ప్రకటించడంతో నమ్మక తప్పలేదు. 
 
విడాకుల అనంతరం ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో సమంత అన్నపూర్ణ స్టూడియోలో కనిపించడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. సమంత ఎందుకు వచ్చిందా అని అంతా ఆరా తీయడం స్టార్ట్ చేసారు. ఈమె రావడానికి కారణం శాకుంతలం సినిమానే అంటున్నారు. ఈ సినిమా డబ్బింగ్ కోసం ఆమె అన్నపూర్ణ స్టూడియోకు వచ్చినట్లు తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్ర‌మ సంబంధాల నేప‌థ్యంలో - దొరకునా ఇటువంటి సేవ