Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్ర‌మ సంబంధాల నేప‌థ్యంలో - దొరకునా ఇటువంటి సేవ

Advertiesment
అక్ర‌మ సంబంధాల నేప‌థ్యంలో - దొరకునా ఇటువంటి సేవ
, గురువారం, 25 నవంబరు 2021 (15:43 IST)
Sandeep Pagadala, Navya Raj
పెద్ద సినిమాలు వ‌ర‌స‌గా విడుద‌ల‌కు వచ్చెనెల‌లో దూసుకువ‌స్తున్నాయి. అందులో మ‌ళ్లీ ఇలాంటి అవ‌కాశం రాదేమోన‌ని `దొరకునా ఇటువంటి సేవ` అనే చిత్రం రాబోతోంది. 
 
సందీప్ పగడాల, నవ్య రాజ్ జంటగా దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్న సినిమా 'దొరకునా ఇటువంటి సేవ'. 'ఏ డేంజరస్ ఫ్యామిలీ గేమ్'... అనేది ఉపశీర్షిక. వెంకీ ద‌డ్‌బ‌జ‌న్‌, టి.ఎన్.ఆర్, రవి వర్మ, అపూర్వ, నక్షత్ర, బేబీ వీక్ష, మాస్టర్ రిత్విక్ రెడ్డి ప్రధాన తారాగణం. డిసెంబర్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. 
 
దర్శకుడు రామచంద్ర రాగిపిండి మాట్లాడుతూ "ఒక మంచి విషయం చెబుతూ మంచి సినిమా తీయడం చాలా సులభం. సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం. ప్రస్తుతం సమాజంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగే నేరాలు విపరీతంగా పెరిగాయి. ప్రతి పదిమందిలో ఏడుగురు అక్రమ సంబంధాలు ఇష్టపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. క్షణికానందం కోసం ఎవరైనా అడ్డొస్తే  చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో కథతో ప్రేక్షకులకు నచ్చే విధంగా  'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్', 'గుంటూరు టాకీస్', 'ఆర్ఎక్స్ 100' సినిమాల తరహాలో వాటికి భిన్నమైన కంటెంట్‌తో సినిమా తెరకెక్కించాను" అని అన్నారు.
 
నిర్మాత దేవ్ మహేశ్వరం మాట్లాడుతూ "ఎవరూ ధైర్యం చేయలేని కొత్త కథాంశాలను బోల్డ్‌గా, బ్యాలెన్స్డ్‌గా తెరకెక్కించినప్పుడు ఆ సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నప్పుడు పెద్ద సినిమాల మధ్య వచ్చినా విజయం అందిస్తారని డిసెంబర్ 10న 'దొరకునా ఇటువంటి సేవ' సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్ టిక్కెట్ విధానానికి ఓకేగానీ... ఆ ఒక్కటి చేస్తే మంచిది : చిరంజీవి