Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనసు దోచుకున్న సమంత....

టాలీవుడ్ కుందనపు బొమ్మ మరోసారి అందరి మనసును దోచేసుకుంది. వీలైనప్పుడల్లా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ఆదరణ పొందుతుంది. దీని కోసం ఓ ట్రస్ట్‌ను కూడా సమంత ఏర్పాటు చేసింది. దాని ద్వారానే వీలైనన్ని కార్యక

Advertiesment
Samantha
టాలీవుడ్ కుందనపు బొమ్మ మరోసారి అందరి మనసును దోచేసుకుంది. వీలైనప్పుడల్లా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ఆదరణ పొందుతుంది. దీని కోసం ఓ ట్రస్ట్‌ను కూడా సమంత ఏర్పాటు చేసింది. దాని ద్వారానే వీలైనన్ని కార్యక్రమాలు చేస్తుంది. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారులకు ప్రత్యూష ఆర్గనైజేషన్ పేరుతో ఆమె అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. 
 
తాజాగా చాందిని అనే మరో పాప కాలి శస్త్ర చికిత్సకు సాయం చేసి వార్తల్లోకెక్కింది. రెండురోజుల క్రితం నగరంలోని ఓ హాస్పిటల్లో చాందినికి శస్త్ర చికిత్స జరిగింది. సమంత బుధవారం హాస్పిటల్కు వెళ్లి పాపను పరామర్శించింది. సహకారం అందించిన హాస్పిటల్కు, సర్జరీ చేసిన డాక్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. 
 
సమంత చేస్తున్నసాయానికి, ఆమె చేస్తున్న సేవలకు అభిమానులు ఆమెపై పొగడ్తల వర్షాన్నికురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి చిరునవ్వులకు కారణమైన సమంత మరోసారి అందరి మనసు దోచుకుంది. ఇంతకుముందు కూడా ఆమె అనేకమంది చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా సాయం చేసిన సంగతి విదితమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియల్‌ లైఫ్‌లోనూ ర్యాగింగ్‌ తప్పలేదట : సోనాక్షి సిన్హా