టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు దూరమైనప్పటికీ ఏమాత్రం తన క్రేజ్ తగ్గలేదని తెలుస్తుంది. ప్రతినెల ఓర్మాక్స్ మీడియా అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన సెలబ్రిటీల జాబితాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ నెలకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సౌత్ స్టార్ హీరోయిన్లను దాటుకుని సమంత మొదటి స్థానంలో నిలవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ జాబితాలో సమంత మొదటి స్థానంలో ఉండగా రష్మిక మందన్న పదో స్థానంలో ఉండడం గమనార్హం. రష్మిక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ఈమె మాత్రం పదో స్థానంలో ఉండటంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సమంత ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమె గత కొద్ది రోజుల క్రితం మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డారు. అయితే ఈ వ్యాధి నుంచి కొంత కోలుకున్నప్పటికీ ఇంకా ఈ వ్యాధి పూర్తి నయం కాకపోవడంతో తిరిగి ఆమె సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది.