కరోనావైరస్ కారణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగులు రద్దయి ఎక్కడి నటులు అక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో సెలబ్రిటీలు ఇంటికి పరిమితమైనా, ఏదో వ్యాపకంలో గడిపేస్తున్నారు. అక్కినేని సమంత అయితే ఏకంగా కూరగాయలను పండించేస్తోంది. తమ ఇంటి ఆవరణలో ఆకు కూరలు, కూరగాయ మొక్కలను పెట్టేసి వాటితో చైతుకి చక్కగా వంటి చేసి పెడుతోంది.
తాజాగా ఈ వారం ఆమె క్యారెట్ చెట్లను పీకి వాటితో వంటకాలను చేస్తానంటూ ఇన్‌స్టాగ్రాంలో ఫోటో పెట్టింది. తన ఇన్‌స్టాలో పోస్ట్ పెడుతూ... "ఈ వారం మెనూ... క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ వేపుడు, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోసా" అని కామెంట్ చేసింది. మొత్తమ్మీద చైతుకి ఈ వారం అంతా క్యారెట్‌తో పండగేనన్నమాట.