అలియా.. రణ్‌వీర్‌ను మాయం చేసేయ్.. అతనెలాగో మాయమైపోతున్నాడు: సల్మాన్
బాలీవుడ్ అగ్రతార కత్రినా కైఫ్‌పై కరణ్ విత్ కాఫీ ప్రోగ్రామ్‌లో రణ్‌వీర్ కామెంట్లు చేస్తుంటే పగలబడి నవ్విన రణ్‌బీర్ కపూర్‌పై.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సెటైర్ విసిరాడు. కత్రినా కైఫ్ కారణంగా సల్మాన్
బాలీవుడ్ అగ్రతార కత్రినా కైఫ్‌పై కరణ్ విత్ కాఫీ ప్రోగ్రామ్‌లో రణ్‌వీర్ కామెంట్లు చేస్తుంటే పగలబడి నవ్విన రణ్‌బీర్ కపూర్‌పై.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సెటైర్ విసిరాడు. కత్రినా కైఫ్ కారణంగా సల్మాన్‌కి రణ్‌బీర్‌తో విభేదాలు ఏర్పడ్డాయని రణ్‌బీర్ సినిమాల్లోకి రాకముందు సల్మాన్ అతనిపై చేయిచేసుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ తాజాగా సల్మాన్ ఖాన్ రణ్‌బీర్‌పై సెటైర్లు విసిరాడు.
సల్లూభాయ్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఆలియా భట్ డియర్ జిందగీ చిత్ర ప్రచార కార్యక్రమానికి వచ్చింది. డియర్ జిందగీ తర్వాత ఆలియా రణ్‌బీర్‌తో కలిసి 'డ్రాగన్' సినిమాలో నటించనుంది. దీనిపై సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'రణ్‌వీర్‌ని మాయం చేసేయ్.. రణ్‌బీర్ ఎలాగూ మాయం అయిపోతున్నాడు' అన్నాడు. రణ్‌బీర్‌నటించిన 'యే దిల్ హై ముష్కిల్'కి ముందు అతని కెరీర్‌గ్రాఫ్ ఫ్లాప్స్‌తో సాగడంతో సల్మాన్ ఇలా కామెంట్ చేశాడని సినీ పండితులు అంటున్నారు.