Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సబర్ణ కేసు.. రహస్య వివాహమే కారణమా..? భర్తే సబర్ణను చంపేశాడా? ఏమైంది..?

సబర్ణ కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెది హత్య? లేకుంటే ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. సినీనటి, సీరియల్ నటి అయిన సబర్ణ.. అలియాస్ సుగుణ మృతి కేసుకు ఆమె భర్తకు లింకున

Advertiesment
Sabarna's Death
, మంగళవారం, 15 నవంబరు 2016 (10:11 IST)
సబర్ణ కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెది హత్య? లేకుంటే ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. సినీనటి, సీరియల్ నటి అయిన సబర్ణ.. అలియాస్ సుగుణ మృతి కేసుకు ఆమె భర్తకు లింకునట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె భర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
చెన్నై మదురైవాయిల్‌లోని ఓ ఫ్లాటులో ఆదివారం సబర్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు విచారణ జరిపిన పోలీసులు.. సబర్ణ ఉత్తరాదికి చెందిన సినీ రంగానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని.. ఏడాది క్రితం అతనని రహస్యంగా వివాహం చేసుకుందని తేలింది. ఈ కారణంగానే ఆమె తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటుందని, గత రెండు నెలలుగా సపర్నను చూసేందుకు భర్త రాలేదని పోలీసుల విచారణలో తెలిసింది. ఉడుంబలై పట్టైకు చెందిన సబర్ణ తల్లి పుష్పలత, తండ్రి ఆనంద్ కుమార్, సోదరుడు పక్కనే ఉన్న విరుగంబాక్కంలో నివాసం ఉంటుండంగా ఆమె ఒంటిరిగా ఉంటోంది.  
 
దీంతో ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా సపర్ణ ఇబ్బందులు పడ్డారని, భర్తతో సెల్‌ఫోన్‌లో మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. కానీ సబర్ణ మరణించేందుకు ముందు రోజు ఆమెను చూసేందుకు ఆమె భర్త వచ్చాడని.. అతను తిరిగి వెళుతున్న సమయంలో తనతోనే ఉండాలని ఆమె బెదిరించిందని, అంతేగాకుండా కత్తి తీసుకుని చేతిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో పోలీసులకు అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. 
 
ఆమె భర్త సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడంతో సబర్ణను హత్య చేసి ఆధారాలను నాశనం చేసి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. సపర్ణ మృతి తర్వాత ఇంతవరకు భర్త వచ్చి చూడకపోవడం గమనార్హం. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోండాలు, బజ్జీలు తింటూ కాలం గడిపేస్తున్నారని అన్నాను.. తప్పేముంది..? ప్రశ్నించడం నేరమా?: విశాల్