Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోండాలు, బజ్జీలు తింటూ కాలం గడిపేస్తున్నారని అన్నాను.. తప్పేముంది..? ప్రశ్నించడం నేరమా?: విశాల్

తమిళ నిర్మాతల సంఘం నిర్వాహకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై నటుడు విశాల్‌పై తాత్కాలిక సస్పెన్షన్ విధించినట్లు నిర్మాతల మండలి ప్రకటించిన నేపథ్యంలో విశాల్ స్పందించాడు. ప్రశ్నించడమే నేరమా? ప్రజాస్వామ

బోండాలు, బజ్జీలు తింటూ కాలం గడిపేస్తున్నారని అన్నాను.. తప్పేముంది..? ప్రశ్నించడం నేరమా?: విశాల్
, మంగళవారం, 15 నవంబరు 2016 (09:56 IST)
తమిళ నిర్మాతల సంఘం నిర్వాహకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై నటుడు విశాల్‌పై తాత్కాలిక సస్పెన్షన్ విధించినట్లు నిర్మాతల మండలి ప్రకటించిన నేపథ్యంలో విశాల్ స్పందించాడు. ప్రశ్నించడమే నేరమా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని నటుడు, నిర్మాత, నడిగర్‌ సంఘం కార్యదర్శి విశాల్ తెలిపాడు. సస్పెన్షన్‌తో షాక్‌కు గురికాలేదని.. ఆశ్చర్యపోయానని వెల్లడించాడు. తన సస్పెన్షన్‌ను చట్టబద్దంగా ఎదుర్కొంటానని, ఈ విషయంలో భయపడేది లేదనీ విలేకరుల సమావేశంలో విశాల్‌ అన్నారు. 
 
తనకు నిర్మాతల సంఘం నుంచి అంతకు ముందు ఎప్పుడో ఒక లేఖ వచ్చిందనీ, అందులో సంఘం అధ్యక్షుడి పేరుగానీ, కార్యదర్శి పేరుగానీ లేదనీ, ఒక న్యాయవాది ద్వారా ఆ లేఖను పంపారనీ విశాల్ వివరించారు. అయినా ఒక నిర్మాతగా సహ నిర్మాతలకు మంచి జరగాలని కోరుకోవడం, వారి పక్కన నిలబడి ప్రశ్నంచడం నేరమా? అంటూ అడిగాడు. 
 
అప్పుడెప్పుడో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాతల సంఘం నిర్వాహకులు నిర్మాతల శ్రేయస్సు గురించి పట్టించుకోవడం లేదనీ, బోండా, బజ్జీలు తింటూ కాలం గడిపేస్తున్నారని అన్నానని తెలిపారు. అలా అనడం తప్పని తాను భావించడం లేదని పేర్కొన్నారు. అదే తప్పు అయితే అంతకు ముందు అలాంటి వ్యాఖ్యల్నే నటుడు కరుణాస్‌ చేశారనీ, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని విశాల్ ప్రశ్నించారు. అప్పట్లో నడిగర్‌ సంఘంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైతేనే తాను ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. 
 
పైరసీని అరికట్టే విషయంలో నిర్మాతల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. తానెలాంటి తప్పు చేయలేదని వెల్లడించాడు. అంతేగాకుండా  జనవరిలో జరగనున్న నిర్మాతల మండలి ఎన్నికల్లో తన తరఫు నుంచి పోటీ ఉంటుందనీ విశాల్‌ వెల్లడించారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత విరోధాలు లేవనీ, నిర్మాతల సం ఘం అధ్యక్షుడు కలైపులి ఎస్‌.థాను అంటే తనకు గౌరవమనీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''లయన్'' కోసం దేవ్ పటేల్ గెటప్ ఛేంజ్.. మళ్లీ ఆస్కార్ అవార్డ్ ఖాయమేనట.. (ట్రైలర్)