Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రజినీకాంత్ "కాలా"ను ముంచిన కావేరి... హీరో తండ్రి వ్యాఖ్యలు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "కాలా". ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచింది. కలెక్షన్లపరంగా ఓకే అనిపించినప్పటికీ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీనిపై తమ

రజినీకాంత్
, శుక్రవారం, 22 జూన్ 2018 (09:18 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "కాలా". ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచింది. కలెక్షన్లపరంగా ఓకే అనిపించినప్పటికీ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీనిపై తమిళ హీరో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు, నటుడు అయిన ఎస్ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
 
తూత్తుకుడి ఘటనపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలే సినిమా పరాజయం కావడానికి కారణమన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే ప్రజలు ఆందోళన బాట పడుతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. కొత్తగా పార్టీలు ప్రారంభించిన వారు సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనే విషయాన్ని గ్రహించేలోపలే... వారి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. 
 
సమాజంలో జరుగుతున్న సమస్యల ఆధారంగా సినిమాలు తీయడం ఒక నటుడి బాధ్యత అని... ప్రజా సమస్యల ఆధారంగానే రజనీ 'కాలా' సినిమాను తీశారని... అయితే తూత్తుకుడి ఆందోళనలపై రజనీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ చిత్రాన్ని పరాజయంపాలు చేశాయని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర గందరగోళం నెలకొందని... అందుకే తాను తన కుమారుడు విజయ్‌ను రాజకీయాల్లోకి రాకుండా దూరంగా ఉంచానని చెప్పారు.
 
కాగా, కాలా చిత్రం విడుదలకు కర్ణాటక రాష్ట్రంలో చిక్కులు వచ్చిన విషయం తెల్సిందే. కావేరీ బోర్డు వ్యవహారంలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఈ చిత్రం విడుదలకు చిక్కులు ఏర్పడ్డాయి. కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి కూడా తానేమీ చేయలేనని నిస్సహాయత వ్యక్తం చేశారు. మిగిలిన రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదలైనప్పటికీ ఫలితం మాత్రం మరోలా వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విప్లవవీరుడు సినీ ఇండస్ట్రీని వీడాలి : బాహుబలి సంగీత దర్శకుడు