Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శరత్‌బాబుతో నమితకు పెళ్లి.. భర్త ఏం చెప్పాడో తెలుసా?

Advertiesment
శరత్‌బాబుతో నమితకు పెళ్లి.. భర్త ఏం చెప్పాడో తెలుసా?
, గురువారం, 27 జనవరి 2022 (08:49 IST)
నమిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్యన్ రాజేష్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నమిత... ఆపై దక్షిణాది సినిమాల్లో గ్లామర్ తారగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆమె కాస్త లావెక్కిపోవడంతో నమితకు ఆఫర్లు తగ్గిపోయాయి. 
 
అటు తర్వాత తమిళ్ బిగ్‌బాస్ సీజన్-1లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఇక నమిత ఆంధ్రా కుర్రాడు అయిన వీరేంద్ చౌదరిని 2017లో ప్రేమ వివాహం చేసుకుంది. చెన్నైలో ఎంచక్కా ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
 
నమితపై పెళ్లికి ముందే రూమర్లు వచ్చాయి. పెళ్లయ్యాక కూడా ఆమెను ఈ రూమర్లు వదల్లేదు. సీనియర్ నటుడు శరత్‌బాబుతో ఆమె డేటింగ్‌లో ఉందన్న వార్తలు కోలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై తన తాజా ఇంటర్వ్యూలో ఆమె భర్త వీరేంద్ర చౌదరి స్పందించారు. 
 
ఈ రూమర్లను మనం విని నవ్వుకోవడం తప్పా వాటి గురించి లోతుగా ఆలోచించాల్సిన పని లేదని వీరేంద్ర చెప్పాడు. ఇక పెళ్లియనప్పటి నుంచి నమిత తనతోనే ఉంటోందని.. తానేంటో ఆమెకు.. ఆమేంటో తనకు తెలుసని వీరేంద్ర చెప్పాడు. 
 
ఇక తనపై ఎన్ని రూమర్లు వచ్చినా కూడా నమిత పట్టించుకోదు అని.. అసలు మేం పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే శరత్‌బాబుతో నమిత పెళ్లని ప్రచారం చేశారు.. అసలు శరత్‌బాబు ఎవరో మాకు తెలియదని వీరేంద్ర ఘాటుగా రూమర్లను స్ప్రెడ్ చేసేవాళ్లకు కౌంటర్లు ఇచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటీటీలో ప్రభాస్ - పూజా హెగ్డేల "రాధేశ్యామ్"?