టాలీవుడ్‌లో కో-ఆపరేషన్ సూపర్ : రుక్సార్ మీర్
తెలుగులో 'షో టైమ్' సినిమాలో హీరోయిన్‌గా నటించిన రుక్సార్ మీర్ ఆ చిత్రం విడుదల కాకముందే రెండవ చిత్రం 'ఆకతాయి'లో నటించింది. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానున్న సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ విశే
తెలుగులో 'షో టైమ్' సినిమాలో హీరోయిన్‌గా నటించిన రుక్సార్ మీర్ ఆ చిత్రం విడుదల కాకముందే రెండవ చిత్రం 'ఆకతాయి'లో నటించింది. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానున్న సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం...
* మీ నేపథ్యం?
లండన్‌లో పుట్టాను. తర్వాత మా నాన్న గోవాలో బిజినెస్ స్టార్ట్ చేయడంతో అక్కడికి మారిపోయాం. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం బెంగుళూర్ వచ్చాను. అక్కడే ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ప్రస్తుతం అక్కడే ఉంటున్నాను.
* సినిమాల్లోకి ఎలా ప్రవేశించారు?
ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుండగా కొంతమంది ఆఫర్లు ఇచ్చారు. అనుకోకుండా చేసి చూద్దామని.. కన్నడ సినిమాలో నటించాను. వినయ్ రాజ్ కుమార్ హీరో. అది బాగా ఆడడంతో మరో సినిమా చేశాను. అలా ఇప్పుడు 'ఆకతాయి' చేశాను.
* ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
కాలేజ్ అమ్మాయి. విదేశాల నుంచి వచ్చి వైజాగ్‌లో ఉండే ఒక ఇండిపెండెంట్ అమ్మాయిలా ఉంటాను. ఈ సినిమాలో యాక్షన్, థ్రిల్, కామెడీ అన్నీ ఉంటాయి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
* యాక్షన్ ఎపిసోడ్స్ చేశారా?
చేయలేదు. ఎందుకంటే ఇందులో అన్ని యాక్షన్ సీన్స్ ప్రీ ప్లాన్డ్‌గా ఉంటాయి. అందుకే నేను ఎక్కువ యాక్షన్ సీన్స్ చేసే అవసరం రాలేదు.
* మొదటి తెలుగు సినిమా ఇంకా ఎందుకు రిలీజ్ కాలేదు?
నా ఫస్ట్ తెలుగు మూవీ 'షో టైమ్'. డైరెక్టర్ కంచి. డీమానిటైజేషన్ కారణంగా రిలీజ్ కాలేదు. ఈ మార్చి నెలాఖరులో విడుదలవుతుంది. దానికంటే 'ఆకతాయి' ఫస్ట్ వస్తోంది కాబట్టి ఇదే నా డెబ్యూ సినిమా.
* కన్నడ, తెలుగు పరిశ్రమల మధ్య తేడా ఏంటి?
భాష తప్ప పెద్ద తేడా ఏం లేదు. రెండు పరిశ్రమలు నన్ను బాగానే ఆదరించాయి. తెలుగు ప్రేక్షకులు, ఇక్కడి మీడియా అందరూ నాకు సపోర్ట్ చేశారు. రెండు మంచి ఇండస్ట్రీలే. నాకు ఇక్కడ ఛాన్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంది.
* సినిమాలు ఎలా ఒప్పుకున్నారు?
నేను చేసిన పాత్రలన్నీ చాలా సీరియస్‌గా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు. కానీ ఇందులో కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు కథ కూడా బాగా నచ్చింది. టీమ్ కూడా చాలా మంచి వారు. ఈ పాత్ర నాకొక చేంజ్‌లా అనిపించింది.