Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్రపురి కాలనీలో రూ.300 కోట్ల స్కాం : నటులు ఓ కళ్యాణ్

Advertiesment
చిత్రపురి కాలనీలో రూ.300 కోట్ల స్కాం : నటులు ఓ కళ్యాణ్
, మంగళవారం, 8 డిశెంబరు 2020 (18:08 IST)
సినిమా రంగంలో ఉన్న కార్మికులకు సొంతింటి కలను సాకారం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం కేటయించిన 67 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన చిత్రపురి కాలనీ నిర్మాణంలో పలు అక్రమాలు జరిగాయని, నిజమైన కార్మికులకు ఇల్లు దక్కలేదని, ప్రస్తుతం అక్కడ ఉన్న కొందరు సభ్యుల హయాంలో 300 కోట్ల స్కామ్ జరిగిందంటూ సీనియర్ నటుడు ఓ.కళ్యాణ్ ఆరోపించారు. ఈ నెల 10న చిత్రపురి కాలనీ హోసింగ్ సొసైటీలో జరిగే ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నటుడు ఓ కళ్యాణ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మంగళవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. 
 
ఈ కార్యక్రమంలో ఓ కళ్యాణ్ మాట్లాడుతూ .. గత 35 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నాను. నన్ను అభిమానిస్తూ ఆదరిస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఉన్నాను. ఫిలిం ఫెడరేషన్‌లో చేశాను. నేను ప్రతి విషయంలో ప్రశ్నిస్తూనే ఉంటాను అన్న సంగతి తెలిసిందే. 
 
ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే.. ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి 65 ఎకరాలు ఇచ్చింది. గత 20 సంవత్సరాల నుండి అక్కడ అవినీతి జరుగుతుంది. 2001, 2005, 2010, 2015 ఇలా ప్రతిసారి చిత్రపురి హౌసింగ్‌లో సినీ కార్మికుల సొమ్మును అక్కడున్న కమిటీ 11 మంది సభ్యులు దోచుకుంటున్నారు. ప్రతిసారి నేను ఈ విషయంపై ఫైట్ చేయడం జరుగుతుంది. 
 
కొందరు ఈ విషయంలో న్యాయం చేయాలనీ చూస్తున్నా కూడా కావడం లేదు. గత 20 ఏళ్ళనుండి అవినీతి జరుగుతుంది. సినీ కార్మికుల కోసం ఇచ్చినదాన్ని దోచుకుంటుంటున్నారు. అక్కడ 300 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. ఈ కమిటీలో ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వర రావు, వినోద్ బాల ఇలా 11 మంది సభ్యులు అక్కడే పాతుకుపోయి అక్రమాలు చేస్తున్నారు. 
 
తమ్మారెడ్డి భరద్వాజ ప్రెస్ మీట్‌లో సినిమా వాళ్లకు ఇల్లు కట్టేందుకు డబ్బులు లేవని చెప్పి.. బయటివాళ్లను చేర్చుకోవాలని బయటవాళ్ళతో కుమ్మక్కయి నిర్మాణం చేపట్టారు. మన దగ్గర డబ్బు లేదని అంటే సినిమా వాళ్లంతా క్రికెట్ ఆడో, ఇంకోటి చేసి ఫండ్ కలెక్ట్ చేసిన సందర్భాలు లేవా? ఆ విషయంలో పరిష్కారం ఉన్నా కూడా బయటివాళ్లను మభ్యపెట్టి ఇక్కడ ప్లాట్స్ ఇప్పించడం జరిగింది. 
 
కాంట్రాక్టర్‌కు ఇచ్చేదాంట్లో కూడా అవినీతి. ఇలా జరిగిన ప్రతి సారి నేను అడ్డు పడడం జరుగుతుంది. నాటో పాటు నా కమిటీలో ఉన్న కస్తూరి శ్రీనివాస్, ఎన్నారై, అలాగే నాతో ఉన్న నా టీం సభ్యులు న్యాయం చేయాలనీ అనుకున్నాం. ఈ విషయంలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్‌తో సంప్రదించాం కానీ అయన కూడా ఈ విషయంలో ఆసక్తి చూపకపోవడంతో పాటు భరద్వాజ ప్యానల్‌లో చేరారు. 
 
మేమిచ్చిన లెటర్స్, కంప్లైంట్స్‌తో వీళ్ళపై 51 ఎంక్వయిరీ అనేది వేశారు. పరుచూరి వెంకటేశ్వర రావు అండ్ కమిటీపై. అది ప్రభుత్వం వేసిన కమిటీ. ఇక్కడ ఐవిఆర్ సిఎల్ అనే కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల మొబిలైజేషన్ డిపాజిట్ అనేది మనం పేయ్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రతి బిల్‌కు 10 పర్సెంటెజ్ అన్నది కట్ చేయాలి. కానీ వీళ్ళ కిక్ బ్యాంక్స్ తరహాలో వెనక డబ్బు వసూలు చేసుకుని తినేశారు. అలా ఆ డబ్బు రూ.55 కోట్ల వరకు పెరిగింది. దాని వడ్డీతో కలిపి రూ.100 కోట్లు అయింది. అలా వందకోట్ల నష్టం కలుగచేసారు.
 
అలాగే స్టేట్ బ్యాంక్ నుండి మనం లోన్ తీసుకున్న డబ్బు రూ.35 కోట్లు. మొత్తం 25 ఎకరాల పొలం తాకట్టు పెట్టి ఆ లోన్ తీసుకోవడం జరిగింది. ఈ 25 ఎకరాలకు డబ్బు కట్టాక నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ కింద అది యాక్షన్‌కు వెళ్ళిపోయింది. ఈ డబ్బంతా ఎక్కడికి డైవర్ట్ చేసారు. ఇందులో 2 బెడ్ రూమ్ ప్లాట్స్ విషయంలో ఇంకా నిర్మాణం జరగలేదు. పాపం వాళ్ళు 10 ఏళ్లుగా ఇంకా డబ్బులు కట్టడంతో పాటు అటు రెంట్స్ కూడా కట్టుకుంటున్నారు. వాళ్లకు ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు. ఈ డబ్బంతా తినేశారు వీళ్ళు .. దానికి సంబంధించిన రుజువులు, అధారాలు ఉన్నాయి. 
 
ఇదంతా చేసింది ఇదే గ్రూప్ 2000 సంవత్సరం నుండి ఇదే టీం ఘోరమైన విధంగా దోచుకుంటుంటున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా నీతి న్యాయం, ధర్మం అంటూ వీళ్ళే కూర్చుంటున్నారు. ఈ ఎలెక్క్షన్ తర్వాత అక్కడ ఏమి ఉండదు. అక్కడ ట్విన్ టవర్స్ అనేది కడుతున్నారు. మూడున్నర ఎకరాల్లో.. అందులో కూడా ఎదో తినేసేయాలి అని చూస్తున్నారు. 
 
అక్కడ కూడా పోటీ, పోటీ.. వినోద్ బాల, కొమర వెంకటేష్‌పైన పోటీ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ పొతే పోనీ అంటూ తమ్మారెడ్డి భరద్వాజ ప్యానల్‌లో చేరారు. ఇప్పటికే ఎన్నో అవకతవకలు జరిగాయి. ఇన్ని జరిగినా కూడా ఏమి చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికే బయటవాళ్ళుకు ఇచ్చేయడంతో వాళ్ళు లోపలి వచ్చేసారు. అందువల్ల ఎవరు నిలబడ్డా కూడా అక్కడ మనం గెలిచే ఛాన్స్ తక్కువ. అలా సి కళ్యాణ్ టీం పనిచేస్తుంది. 
 
ఐవిఎఫ్‌ఆర్ కాంట్రాక్టు‌కు 600 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చేశాం. మనకి ఇల్లు నిర్మించి ఇంటి తాళం ఇచ్చే వరకు వాళ్లదే బాధ్యత, కానీ ఆ విషయం గురించి ఎవరు చెప్పరు. హుడా పర్మిషన్ లేకుండా రో హౌస్ నిర్మిస్తున్నారు? కానీ డూప్లెక్స్, రో హౌస్ లాంటివి కట్టేసారు. అలా కట్టడం వల్ల బయటివాళ్ళు వచ్చారు. అటు వాళ్ళను కూడా మోసం చేసారు. వీళ్ళు అక్కడ కూర్చోవడం తప్ప చేసింది ఏమి లేదు. కనీసం ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కూడా తీసుకోలేదు. వాళ్లకు కావాల్సింది డబ్బు, డబ్బు .. డబ్బు ..  ఇందులో ఏ ఒక్క పాయింట్ కూడా అబద్దం కాదు .. దానికి సంబందించిన ఆధారాలు ఉన్నాయి. 
 
ఇదంతా నేను బాధతో చేస్తున్నాను తప్ప నాకేదో వస్తుందని కాదు. రో హౌస్ కట్టారు. ఉన్న లెక్కకంటె ఎక్కువ స్థలంలో కట్టేసారు. ఎచ్‌ఐ‌జి డుప్లెక్స్ కట్టారు. అది కట్టాల్సిన అవసరం లేదు. ఇవి కట్టకుంటే ఇంకా చాలా మంది కార్మికులకు ప్లాట్స్ దొరికేవి. అలాగే సినీ జర్నలిస్ట్‌లకు ఇవ్వాలని అన్నారు. కానీ అలా ఎవ్వరికి ఇవ్వలేదు. ఇన్ని అవినీతి అక్రమాలు అక్కడ చోటుచేసుకున్నాయి. అందుకే ప్రెస్ ముందుకు వచ్చాను. కనీసం ఇలాగైనా సరే ఈ సమస్యను ప్రజలకు తెలియచేస్తారని నా అభిప్రాయం. 
 
అంతేకాదు క్యాషియర్‌గా ఉన్న పరుచూరి వెంకటేశ్వరావు, ప్రసిడెంట్ తప్పు చేస్తున్నాడు అని కమిటీ వాళ్ళు ముందుకు వచ్చిన కొమర వెంకటేష్‌ని తీసేసారు. అప్పుడు ఆ ప్రెసిడెంట్ చెక్స్‌పై సంతకం చేసేటప్పుడు తెలియదా. ఈయనకు తెలియకుండానే ఇవన్నీ జరిగాయా. అలాగే సెక్రెటరీ వినోద్ బాలకు కూడా తెలియకుండా జరిగిందా. అంత పెద్ద మనిషి.. కార్మికుల సొమ్ముని దోచుకుటూనేవాళ్ళ పంచన చేరి అన్యాయం చేస్తున్నాడు. అయన ఆ తర్వాత రెండేళ్లు ఇంట్లో పడుకున్నాడు. 
 
350 సినిమాలకు రచయితగా పనిచేసిన అయన నీతి న్యాయం అంటూ సినిమాలు చేసే అయన చేసేది ఇదా. గవర్నమెంట్ ఇప్పటి వరకు 200 కోట్లు ఇచ్చింది. ప్రభుత్వమే రోడ్లు వేసింది. దాసరి పుణ్యమా అంటూ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హుడాకు కట్టకుండా 8 కోట్లు సబ్సిడి ఇచ్చారు. ఇప్పుడున్న కేసీఆర్ కూడా తలసాని శీనన్న ద్వారా 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ డబ్బంతా ఎటు పోయింది. ఈ రోజు బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఉంది. అసలు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఎవరు తిన్నారు?
 
అక్టోబరు 25కు వీళ్ళ ఎన్నిక టైం అయిపొయింది. ఆ తరువాత వీళ్ళు అక్కడ ఉండొద్దు. కానీ హోసింగ్ సొసైటీని మోసం చేసి మేనేజ్ చేసుకున్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు పర్సనల్ ఇంచార్జ్ కమిటీ (pic)కి ఇంచార్జ్‌గా చేసారు. కమిటీ వీళ్లపై ఎంక్వయిరీ వేయగానే.. వినోద్ బాల దాన్ని ఆపడానికి కోర్టులో ఛాలెంజ్ చేసాడు. మా పై కమిటీ వద్దండి అంటూ? అలాగే కాంట్రాక్టర్ దగ్గర ఆరుకోట్ల రూపాయలు స్కాం చేసినట్టు సిసి కెమెరాల ఆధారాలు ఉన్నాయి. పార్క్ హయత్ హోటల్‌లో ఈ పదకొండు మంది గ్యాంగ్ కాంట్రాక్టర్‌తో డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
 
కృష్ణమోహన్ రెడ్డి అన్నే ఏమి లేని దర్శకుడు. కృష్ణానగర్ నుండి ఆటోలో వచ్చి.. నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి ఇప్పుడు అక్కడ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. డుప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాడు. లక్షలకు లక్షలు వడ్డీలకు ఇస్తున్నాడు. ఈ సొమ్మంతా ఎవరిదీ.. అడిగేవాడు లేడు. అందుకే ఈ విషయాలపై మేము పోరాటం చేస్తున్నాం. ఈ విషయంలో నిర్మాత సి కళ్యాణ్ మంచి వ్యక్తి. అయన పెద్ద మనిషి అని అయన ద్వారా ఈ సమస్యలు సాల్వ్ చేయాలనీ, ఆయనను ప్రసిడెంట్ చేయాలనీ అనుకుంటే.. అయన ఎవరైతే నలభై కోట్ల నష్టం చేసారో తమ్మారెడ్డి భరద్వాజను ప్యానల్‌లో పెట్టుకున్నాడు. ఇలా ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు. 
 
కోటగిరి వెంకటేశ్వరా రావు కూడా మనకు ఎదో మంచి చేస్తారని అంటే.. వాళ్లకు నచ్చిన వాళ్ళకే పనిచేస్తూ.. వాళ్లకు కావాల్సిన వారికే అన్ని అందేలా చేస్తారు. అందుకే మా పోరాటం మేమె చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పుడు 350 ఎకరాలు సినీ కార్మికులకు ఇల్లు వచ్చేలా ఏర్పాటు చేస్తాం. సీనియారిటీ ప్రకారం ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ జెస్టిస్ ఫిలిం ఇండస్ట్రీ, ఇన్ జస్టిస్ చిత్రపురి కాలనీ, తప్పకుండా ఈ స్కామ్‌లో ప్రతి ఒక్కరు దొరుకుతారు. అందరు జైలుకు వెళ్లడం ఖాయం అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులంతా నిజ‌మైన ఫైట‌ర్లు : సి.క‌ళ్యాణ్‌