Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Advertiesment
Yash Toxic release poster

దేవీ

, సోమవారం, 24 మార్చి 2025 (08:21 IST)
Yash Toxic release poster
రాకింగ్ స్టార్ యష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్‌’ మీద ఉన్న అంచనాలు అందరికీ తెలిసిందే. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 19న విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఉగాది, గుడి పడ్వాతో మార్చి 19న కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడంతో పాటు, మార్చి 20/21న ఈద్ వేడుకలతో టాక్సిక్ భారతదేశం అంతటా సందడి చేయనుంది.
 
కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో టాక్సిక్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రాజెక్ట్‌‌గా టాక్సిక్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. భారతీయ ప్రాజెక్ట్‌గా టాక్సిక్ ఇంటర్నేషనల్ సినిమాటిక్ అనుభవాన్ని అందించనుంది. ఈ చిత్రం భారతీయ, అంతర్జాతీయ సినిమా రంగం నుంచి ఎంతో అనుభవం, ప్రతిభ ఉన్న వారినందరినీ ఒకే చోటకు చేర్చనుంది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో పాటు ఇతర భాషల్లోకీ డబ్ చేయనున్నారు.
 
టాక్సిక్ విడుదల తేదీ ప్రకటన సందర్భంగా రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' నుంచి అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో కనిపించే మంటలు, చుట్టూ ఉన్న పొగ, హీరోని చూపించిన తీరు, ఆ గన్‌ను పట్టుకున్న విధానం, హీరో పెట్టుకున్న టోపీ ఇలా అన్నీ కూడా ఎంతో స్టైలీష్‌గా ఉన్నాయి. యష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్‌గా ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
 
ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌కు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన మేకర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ అవార్డు, సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక గ్లోబల్ ఫిల్మ్‌మేకింగ్ అవార్డు వంటి వాటితో గీతు మోహన్ దాస్ ప్రపంచ వేదికలపై తన సత్తాను చాటుకున్నారు. ఇక ఇప్పుడు టాక్సిక్ మూవీతో మరోసారి తన మార్క్ వేయబోతోన్నారు.
 
కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మార్చి 19, 2026న థియేటర్లలోకి రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ