Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

Advertiesment
Kantara Chapter 1 shooting complete

దేవీ

, సోమవారం, 21 జులై 2025 (16:40 IST)
Kantara Chapter 1 shooting complete
రాజకుమార, కెజిఎఫ్, సలార్, కాంతార వంటి మైల్ స్టోన్ చిత్రాలతో ప్రశంసలు పొందిన నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్, ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటైన కాంతార చాప్టర్ 1 ను రూపొందిస్తోంది. రిషబ్ శెట్టి  ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ఫస్ట్ లుక్, బర్త్ డే స్పెషల్ పోస్టర్ తో ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
 
ఈరోజు, నిర్మాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంతార చాప్టర్ 1  మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దాదాపు 250 రోజుల షూటింగ్, మూడు సంవత్సరాల కష్టం అంతా మిక్స్ అయిన ఈ వీడియో ఒక సినిమాటిక్ ఫెస్టివల్‌లా కనిపిస్తుంది.
 
కేవలం బీహైండ్ ది సీన్స్ అనిపించకుండా సినిమా పుట్టిన తీరుని అద్భుతంగా చూపించారు. విభిన్న భూభాగాలు, కాంప్లెక్స్ సెటప్‌లలో పనిచేసే భారీ టీం కలిగి ఉన్న ఈ వీడియో రిషబ్ శెట్టి డెడికేషన్‌కు ట్రీబ్యూట్ లా వుంది.
 
సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న బి. అజనీష్ లోకనాథ్ ఆల్రెడీ తన స్పిరిచువల్ టచ్ తో అద్భుతం అనిపించారు.  డివోషనల్ విజువల్స్ ను ఆర్ట్ డైరెక్టర్ వినేష్ బంగ్లాన్ అద్భుతంగా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీ విషయంలో అరవింద్ కాశ్యప్ వర్క్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.
 
అక్టోబర్ 2న గ్లోబల్ రిలీజ్ కానున్న ఈ సినిమా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో రానుంది.
 
కాంతార చాప్టర్ 1 తో హోంబాలే ఫిల్మ్స్ భారతీయ సినిమాలో సరిహద్దులను దాటే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది, స్టొరీ టెల్లింగ్, సినిమాటిక్ ఎక్సలెన్స్‌ను బ్లెండ్ చేసి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు