Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Advertiesment
Minister Sridhar Babu, RK Sagar, Komatireddy Venkata Reddy

దేవీ

, సోమవారం, 7 జులై 2025 (10:35 IST)
Minister Sridhar Babu, RK Sagar, Komatireddy Venkata Reddy
మంచి మెసేజ్ తో ది 100 సినిమాని నిర్మించిన నిర్మాతలకు ధన్యవాదాలు. రైట్ టైం లో రైట్ సినిమా ఇది. సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే సినిమా ఫస్ట్ డే చూడాలని నిర్ణయించుకున్నాను. సైబర్ క్రైమ్ నేపధ్యంలో వున్న ఈ సినిమా సమాజానికి చాలా ముఖ్యం అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
 
మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ కథానాయకుడిగా 'ది 100' రూపొందింది. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిధిలుగా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, సాగర్ గారు చాలా అద్భుతమైన నటుడు. ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు వుంది.  సొంత టాలెంట్ తో గొప్ప స్థాయికి ఎదిగారు. భవిష్యత్తులో తను చాలా గొప్ప హీరో అవుతారు. ఈ సంవత్సరం బెస్ట్ ఫిలిమ్ గా ది 100 సినిమా వస్తుంది అని చెప్పడంలో డౌట్ లేదు. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అలా అనిపించింది. ఈ సినిమాని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా చూసి మెచ్చుకున్నారంటే  కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. మొగలిరేకులు సీరియల్ ని మా ఇంట్లో అందరూ చూసేవారు. ఆ సమయంలో ఏ పనులు చేసేవారు కాదు. అంతగా సాగర్ ని అభిమానించే వాళ్ళు. సాగర్ అందరికీ సుపరిచితుడు. ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో సాగర్ అద్భుతంగా ఫిట్ అయ్యాడు. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. సాగర్ ఫ్యూచర్ హీరో అఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్' అన్నారు.
 
మినిస్టర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. మా ప్రాంత వాసి. సొంతగా ఎదిగి ఇంత దూరం వచ్చాడు. ఈ సినిమా ఒక పవర్ఫుల్ వెపన్ లా ఉంటుంది. చాలా మంచి కథ ఫ్యామిలీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ధైర్యాన్ని సాహసాన్నిచ్చే సినిమా. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా సినిమాలు తీశారు. సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలకి సమాధానం దొరికే సినిమా అవుతుందని ఆశిస్తున్నాం అన్నారు
 
హీరో ఆర్కే సాగర్ మాట్లాడుతూ, అంజనమ్మ గారు నా సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. వారికి ధన్యవాదాలు. మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్య నాయుడు గారు సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించారు. వారికి ధన్యవాదాలు సజ్జనార్ గారు, నాగబాబు గారు అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారు  ట్రైలర్ ని లాంచ్ చేస్తే అందరికీ రీచ్ అవుతుందని ఆయన్ని వెళ్లి అడిగాను. ఆయన మా ట్రైలర్ ని లాంచ్ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి ధన్యవాదాలు. ఐటి మినిస్టర్ శ్రీధర్ అన్నతో నాకు చాలా మంచి బాండ్ ఉంది. ఆయన సినిమా చూసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. మంత్రి కోమటిరెడ్డి గారికి థాంక్యూ. మాకు బ్లెస్ చేయడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాతలతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. వారి సపోర్ట్ ని మర్చిపోలేను. డైరెక్టర్ శశి గారు చాలా ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాతో అయినా మంచి పొజిషన్లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను. 
 
 ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది.త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ది 100. ఇది రాసి పెట్టుకోండి. ఈ సినిమాకి అంత పవర్ ఉంది. ఈ సినిమా మస్ట్ గా చూడాలి.  కమర్షియల్ మూవీ. వెరీ టచింగ్ పాయింట్. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఫ్యామిలీ చూడాలి. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థాంక్యూ'అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?