Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

Advertiesment
darshan

వరుణ్

, బుధవారం, 26 జూన్ 2024 (18:34 IST)
కన్నడ నటుడు దర్శన్ వీరాభిమాని రేణుకస్వామి హత్య కేసు విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ‌తోపాటు మొత్తం 14 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. గత కొద్దికాలంగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న దర్శన్, పవిత్ర, ఇతరులను విచారించగా వారు చేసిన అకృత్యాలు వెలుగు చూస్తున్నాయి. 
 
రేణుకస్వామి అదృశ్యంపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరిని అరెస్ట్ చేసి విచారించగా.. దర్శన్, పవిత్ర పేర్లు బయటకు వచ్చాయి. ఆ వ్యవహారంలో వారిని అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. వారు రేణుకస్వామిని తీసుకొచ్చి ఎంత దారుణంగా హింసించారనే విషయం బయటకు వచ్చింది.‌
 
శాఖాహారం మాత్రమే తీసుకొనే రేణుకా స్వామి నోట్లో మాంసం ఎముక పెట్టి కొట్టారు. మాంసం తింటే నీకు దెబ్బలను ఓర్చుకొనే శక్తి వస్తుందని శారీరకంగా హింసించారు. చర్మం చిట్లిపోయి ఊడిపోయే విధంగా కొట్టారు. దాంతో అతడు మరణించాడు అనే విషయం విచారణలో వెలుగు చూసింది. తాజాగా రేణుకా స్వామి మృతదేహం ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష మయ్యాయి. 
 
వాటిని చూసిన నెటిజెన్స్ ఇలాంటి దారుణమైన సంఘటనకు బాధ్యుడైన దర్శన్, పవిత్రగౌడ, ఇతరులను ఏ మాత్రం వదిలిపెట్టకూడదు. సభ్య సమాజం తలవంచుకొనేలా వ్యహరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రేణుకస్వామి భార్య ప్రస్తుతం గర్భిణి కాగా.. భర్త మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉందని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్