పిస్తా పప్పులు చురుకైన జీవనశైలికి తోడ్పడే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలను కలిగివుంటాయి. పిల్లలు, మహిళలు పిస్తా వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం ఎంతో మేలు చేస్తాయి.
ప్రోటీన్‌లను తగ్గించవద్దు: తీవ్రమైన వ్యాయామం తర్వాత తిన్నప్పుడు ప్రోటీన్ తినడం కండరాల పునరుద్ధరణకు ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలో తేలింది.
యాంటీఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. పిస్తాలు కేలరీలు, ప్రోటీన్ల కంటే చాలా ఎక్కువ అందిస్తాయి. అవి మెగ్నీషియం, విటమిన్ ఎ, ఆరోగ్యాన్ని కాపాడే ఇతర ఫైటోకెమికల్స్‌తో నిండి వున్నాయి.
మధుమేహం లేని వారితో పోలిస్తే ఉన్న వాళ్లలో గుండెజబ్బులు వచ్చే ఆస్కారం అధికం. రక్తంలో కొవ్వు శాతం పెరగకుండా చూస్తుంది పిస్తా. రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి హృదయ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుతుంది.