Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Renu Desai: రేణు దేశాయ్ నటిస్తున్న సినిమా 16 రోజుల పండగ

Advertiesment
Sai Krishna Dammalapati, Gopika Udayan, Renu Desai others

దేవీ

, బుధవారం, 26 నవంబరు 2025 (16:29 IST)
Sai Krishna Dammalapati, Gopika Udayan, Renu Desai others
వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం 16 రోజుల పండగ. సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు.  గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై  ప్రొడక్షన్ నెం-1గా  సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు.
 
ఈ రోజు ఈ చిత్రం పూజాకార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి కోన వెంకట్, కేకే రాధా మోహన్ నిర్మాతలకి స్క్రిప్ట్ అందించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల క్లాప్ కొట్టారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ కు డి సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు.  నిర్మాతలు అల్లు అరవింద్ గారు, మైత్రి రవి గారు దామోదర ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి హాజరై టీం కి అభినందనలు తెలిపారు.
 
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. పి కళ్యాణి సునీల్ డీవోపీ, సూర్య తేజ లంక ఎడిటర్. డైరెక్టర్ సాయికిరణ్ అడివి తో కలసి మల్లి అంకం, సోమ శేఖర్ పొక్కళ్ల, శ్రీరామ్ మన్నార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
 
ఈ సందర్భంగా సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ..  ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై 16 రోజుల పండగ సినిమా ఈ రోజు ప్రారంభం కావడం ఆనందంగా వుంది. శేఖర్ కమ్ముల, సురేష్ బాబు,  కోన వెంకట్, రాధా మోహన్ ఈ వేడుకకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు.  టైటిల్ ని సజెస్ట్ చేసింది కృష్ణ వంశీ. ఆయనకి కథ విపరీతంగా నచ్చి ఈ టైటిల్ పెట్టమని చెప్పారు. కృష్ణ వంశీ గారికి థాంక్ యూ.  
 
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. సాయి కిరణ్ కోవిడ్ లాక్ డౌన్ కి ముందే ఈ కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. వెంటనే చేస్తానని చెప్పాను. ఇందులో అత్తమ్మ రోల్ చేస్తున్నాను. నా ఏజ్ కి సరిపోతుందా అనిపించింది. కానీ ఆ పాత్ర, కథ అద్భుతమైనది. సినిమా చూస్తున్నప్పుడే ప్రేక్షకులకే అర్ధమైపోతుంది. సాయి కిరణ్ చాలా మంచి దర్శకుడు. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్ యూ.    
 
హీరో సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఎలాంటి సినిమా చేయాలి, ఎంత మంచి కథని ఎంచుకోవాలనే సమయంలో డైరెక్టర్ గారు ఈ కథ చెప్పారు. సాయి కిరణ్ గారి దర్శకత్వంలో ఇంత మంచి కథతో నా మొదటి సినిమా చేయడం అదృష్టం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు. ప్రేక్షకులని అలరించడానికి అన్ని విధాలుగా కష్టపడి పని చేస్తాను.
 
గోపిక ఉదయన్ మాట్లాడుతూ..ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ కథ వినగానే చాలా నచ్చింది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్ యూ. చాలా మంచి ఫన్ వున్న సినిమా ఇది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది.
 
అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ..16 రోజుల పండగ చాలా ఇష్టంగా చేస్తున్న సినిమా. టైటిల్ చాలా ముచ్చటగా ఉంది. చాలా అద్భుతమై కథ. ఇలాంటి సినిమాలో పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. రేణు గారితో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా మీ అందరి మనసులో నిలిచిపోతుంది.
 
రామ్ లక్ష్మణ్ మాస్టర్ మాట్లాడుతూ..16 రోజుల పండగ.. వందరోజులు పండగ అవుతుంది. సాయి కృష్ణ హీరో అవుతుంటే మా అబ్బాయే హీరో అవుతున్నంత ఆనందంగా వుంది. తనని దీవించడానికి వచ్చిన అందరికీ థాంక్ యూ. సాయి కృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డ్ అందుకున్నారు. తను పెద్ద హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఇందులో మంచి యాక్షన్ కూడా వుంది. మీ అందరినీ అలరిస్తుంది.  
 
జానీ మాస్టర్ మాట్లాడుతూ.. 16 రోజుల పండగ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. డిఎస్ రావు గారు నాకు ఫస్ట్ ద్రోణ సినిమాలో అవకాశం ఇచ్చారు. వారి అబ్బాయి ఈ సినిమాతో హీరోగా రావడం ఆనందంగా వుంది. తను పరిశ్రమలో మంచి హీరోగా నిలబడాలని కోరుకుంటున్నాను.
 
ప్రొడ్యూసర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ..  అద్భుతమైన కథ ఇది. డైరెక్టర్ గా చెప్పిన వెంటనే చాలా నచ్చింది. మా హీరో సాయి కృష్ణ,  రేణు దేశాయ్ గారు , అనసూయ  గారు ఇలా చాలా మంచి టీంతో సినిమా చేస్తున్నాం. 16 రోజుల పండగ .. వందరోజుల పండగ కావాలని కోరుకుంటున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Samantha: యూఎన్ విమెన్‌ ఇండియాతో చేతులు కలిపిన సమంత