'సింహం' పిల్లకు పవన్ మాజీ భార్య పేరు.. పాతజ్ఞాపకాల్లో మాజీ హీరోయిన్

శనివారం, 4 ఏప్రియల్ 2020 (10:10 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్. ఈమె బద్రి సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో పవన్‌పై రేణూ దేశాయ్ మనసుపారేసుకుంది. ఆ తర్వాత వారిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంతలో వారిమధ్య ఏర్పడిన మనస్పర్థలు కారణంగా విడిపోయారు. 
 
ఆ తర్వాత ఎవరిపని వారు చేసుకునిపోతున్నారు. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకున్నాడు. అలాగే, జనసేన పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ఈ పార్టీతో ఆయన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పాపులర్ రాజకీయ నేతగా మారిపోయారు. 
 
అలాగే, రేణూ దేశాయ్ కూడా మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు.. ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా, ర‌చ‌యిత‌గా ఇలా ప‌లు విభాగాల‌లో త‌న ప్ర‌తిభను కనపరుస్తోంది. ప్రస్తుతం మ‌రాఠీ సినిమాని తెర‌కెక్కిస్తున్న రేణూ లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైంది.
 
ఈ నేప‌థ్యంలో పాత జ్ఞాప‌కాల‌ని గుర్తు చేసుకుంటూ వాటిని నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకుంటుంది. తాజాగా 18 ఏళ్ల క్రితం రోమ్‌లో జరిగిన కథని వివ‌రించింది. 18 ఏళ్ళ క్రితం రోమ్‌కి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ వ‌ణ్య‌ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రానికి వెళ్లాను. అక్క‌డ ఆడ సింహం పిల్ల‌ని ప‌ట్టుకున్న‌ప్పుడు చాలా సంతోషంగా ఫీల‌య్యాను.
 
సింహం పిల్ల పేరు ఏంటి అని నేను అడిగినప్పుడు, మీ పేరేమిటి అని ఆ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం యజమాని నన్ను అడిగారు. నేను 'రేణు' అని చెప్పాను. మనం ఈ సింహం పిల్లకు 'రేణు' అని పేరు పెడుతున్నాం అని ఆయన బదులిచ్చారు. 
 
ఆ స‌మ‌యంలో నేను చాలా ఆనందంగా ఫీల‌య్యారు. నా పేరుతో ప్ర‌పంచంలో ఒక బుజ్జి ఆడ సింహం ఉంద‌ని ఆనంద‌ప‌డ్డాను అంటూ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సింహం పిల్ల‌ని ఎత్తుకొని దిగిన ఫోటోల‌ని షేర్ చేస్తూ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కుర్ర హీరోలతోనే చేస్తానంటున్న మాజీ సిఎం భార్య, ఎవరు?