Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సల్మాన్ ఖాన్ "రాధే" దెబ్బకు సర్వర్లు క్రాష్ ...

Advertiesment
Salman Khan
, గురువారం, 13 మే 2021 (20:14 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం "రాధే". ఈ చిత్రం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఓటీటీ వేదికగా విడుదలైంది. కరోనా వైరస్ కారణంగా అగ్ర హీరోలు తమ చిత్రాలను ఓటీటీలో రిలీజే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
అలాగే, సల్మాన్ నటించిన రాధే కూడా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఓటీటీ వేదిక జీ5, జీ5 ప్లస్‌లో విడుదలైంది. అయితే, సల్మాన్‌ నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో వేచిచూస్తున్నారు.
 
దీంతో సినిమా విడుదల సమయం అవగానే అందరూ ఒకేసారి లాగిన్‌ అయ్యారు. దీంతో సర్వర్లన్నీ ఒక్కసారిగా స్తంభించిపోయాయి. ఈ విషయాన్ని జీ5 వారు పరోక్షంగా ట్విటర్‌ వేదికగా ధ్రువీకరించారు. సమస్యను పరిష్కరించి త్వరలోనే మీ ముందుకు వస్తామని వెల్లడించారు. 
 
అయితే, అందరికీ ఈ సమస్య తలెత్తలేదు. కొందరికి మాత్రమే ఉత్పన్నమైంది. సమస్య లేని మాత్రం చిత్రాన్ని యధావిధిగా చూశారు. మరికొంత మందికి ఇప్పటికీ సినిమా అందకపోవడం గమనార్హం. దిశ పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ భారీ యాక్షన్‌ చిత్రానికి ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌, డైరెక్టర్‌ ప్రభుదేవా దర్శకత్వం వహించగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్డౌన్‌లో లాక్... 24 గంటలూ అతనితోనే గడుపుతున్నా : శృతిహాసన్