చెర్రీ ధృవ హిట్.. చరణ్ ఇంట్రడక్షన్ సీన్లో మెగా ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. ఉపాసన హ్యాపీ హ్యాపీ
మెగాస్టార్ తనయుడు చెర్రీ తాజా సినిమా ధృవకు హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ లుక్, నటనకు మంచి మార్కులు పడటంతో ఆయన భార్య ఉపాసన హ్యాపీగా ఉంది. వరుస ఫ్లాప్‌ల తర్వాత తన భర్త చెర్రీ ధృవ హ
మెగాస్టార్ తనయుడు చెర్రీ తాజా సినిమా ధృవకు హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ లుక్, నటనకు మంచి మార్కులు పడటంతో ఆయన భార్య ఉపాసన హ్యాపీగా ఉంది. వరుస ఫ్లాప్‌ల తర్వాత తన భర్త చెర్రీ ధృవ హిట్ కొట్టడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతకుముందు ధృవ ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు హాజరు కాకుండా అందరిలోనూ అనుమానాలు రేకెత్తించిన ఉపాసన.. ధృవ విడుదలకు తర్వాత మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.
ఓ మాస్ థియేటర్లో ‘ధృవ’ సినిమా చూస్తున్న ప్రేక్షకులు.. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్లో చేసిన రచ్చను ఎవరో క్యాప్చర్ చేసి ఉపాసనకు ఇచ్చినట్లున్నారు. దాన్ని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసి, తన ఎగ్జైట్మెంట్‌ను బయటపెట్టింది. ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు థ్యాంక్స్ అని చరణ్ తనకు భర్త అయినందుకు గర్వ పడుతున్నానని ‘ధృవ’ను సూపర్ హిట్టయినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.
ఎప్పుడూ సినిమా వ్యవహారాలపై సోషల్ మీడియాలో పెద్దగా స్పందించని ఉపాసన తొలిసారి ఇలా మెగా అభిమానుల రచ్చకు సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.