Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రవితేజ హీరోగా 'రేసుగుర్రం' కథా రచయిత విక్రమ్ సిరి దర్శకత్వంలో కొత్త సినిమా

'లక్ష్మీ', 'లక్ష్యం', 'రేసుగుర్రం' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తాజాగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా నిర్మించనున

Advertiesment
Ravi Teja
, మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (12:46 IST)
'లక్ష్మీ', 'లక్ష్యం', 'రేసుగుర్రం' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తాజాగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారు. ఎన్టీఆర్‌తో 'అదుర్స్' నిర్మించిన శాసన సభ్యుడు వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించనున్నారు. 
 
నల్లమలుపు బుజ్జి నిర్మించిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'రేసుగుర్రం' చిత్రాలకు స్క్రీన్ ప్లే రచయితగా వ్యవహరించిన విక్రమ్ సిరి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రానికి నంది అవార్డు కూడా అందుకున్నారు విక్రమ్ సిరి. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు.
 
త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ, ''రవితేజ హీరోగా మా సంస్థలో ఇది మొదటి సినిమా. మంచి కథ కుదిరింది. వక్కంతం వంశీ పవర్‌ఫుల్ ఎనర్జిటిక్ స్టోరీ తయారు చేశారు. శాసన సభ్యుడైన వల్లభనేని వంశీతో కలిసి ఈ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తేలియజేస్తాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొల్లి రాజేష్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను చనిపోలేదు.. ఆరోగ్యంగానే ఉన్నా : సిల్వస్టర్‌ స్టాలోన్