భరత్‌ను కడచూపు చూడని రవితేజ.. రూ.1500 ఇచ్చి అంత్యక్రియలు పూర్తి చేయించారు.. ఎవరు?
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడ
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు. అయితే, భరత్ కడసారి చూపులకు అన్న రవితేజ, తల్లి రాజ్యలక్ష్మి రాలేదు.
దీంతో భరత్ బాబాయి మూర్తి రాజు, మరో సోదరుడు రఘు ఈ దహన కార్యక్రమాలు పూర్తిచేశారు. మూర్తిరాజు వృద్ధులైనందున.. ఓ జూనియర్ ఆర్టిస్ట్ చేతికి రూ.1500 ఇచ్చి భరత్ అంత్యక్రియలు పూర్తిచేయించారు. సీనినటులు రాజశేఖర్, జీవిత, అలీ, ఉత్తేజ్, రఘుబాబు తదితరులు భరత్ మృతదేహానికి నివాళులర్పించిన వారిలో వున్నారు.
కాగా, భరత్ అంత్యక్రియలకు హాజరుకాక పోవడంతో రవితేజ ఓ ప్రకటనలో స్పందించారు. సోదరుడి మరణాన్ని తట్టుకోలేక.. 40 ఏళ్ల పాటు కలసిమెలసి ఉన్న తమ్ముడిని నిర్జీవంగా చూడలేకనే తాను దహనక్రియలకు వెళ్లలేదని వివరించారు. తల్లి రాజ్యలక్ష్మి కూడా ఇవే కారణాలతో అంత్యక్రియలకు వెళ్లలేదని తెలిపారు.