బాలీవుడ్‌కి చుక్కలు చూపిస్తున్న టాలీవుడ్.. డీజే ముందు సల్మాన్ ట్యూబ్‌లైటూ ఫట్ మంది
బాహుబలితో మొదలైన తెలుగు సినిమాల హవా హిందీ చిత్రసీమను ప్రకంపనలకు గురి చేస్తోంది. బాహుబలి 2 దెబ్బకు గత రెండు నెలలుగా హిందీ సినిమాలు బాక్సాఫీసు వద్ద బేర్ మంటున్న విషయం తెలిసిందే. తాజాగా ది గ్రేట్ సల్మాన్ ఖాన్ సినిమా కూడా ఫట్ మంది. ఒక తెలుగు సినిమా దెబ్బ
బాహుబలితో మొదలైన తెలుగు సినిమాల హవా హిందీ చిత్రసీమను ప్రకంపనలకు గురి చేస్తోంది. బాహుబలి 2 దెబ్బకు గత రెండు నెలలుగా హిందీ సినిమాలు బాక్సాఫీసు వద్ద బేర్ మంటున్న విషయం తెలిసిందే. తాజాగా ది గ్రేట్ సల్మాన్ ఖాన్ సినిమా కూడా ఫట్ మంది. ఒక తెలుగు సినిమా దెబ్బకు సల్మాన్ నటించిన ట్యూబ్ లైట్ కూడా తొలి రోజు కలెక్షన్ల పరంగా వెనుగబడిపోయిందంటే బాలీవుడ్ ఇప్పడు నిజంగా షాక్ తినాల్సిందే. హిందీ సినిమా మసాలా మిక్సింగ్‌ను దేశం ఒప్పుకునే రోజులు పోయాయనిపిస్తోంది. అల్లు అర్జున్ కూడా బాలీవుడ్‌కి కేకపుట్టిస్తున్నాండంటే హిందీ హీరోల పరువు పూర్తిగా పోతున్నట్లే మరి.
బాలీవుడ్‌కి షాక్ తెప్పిస్తూ అల్లు అర్జున్ ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ సినిమా సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్‌లైట్’ను బీట్ చేసింది. ఈ రెండు చిత్రాలు శుక్రవారం (జూన్ 23) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు వద్ద బాలీవుడ్ సినిమా ‘ట్యూబ్‌లైట్’ను తెలుగు సినిమా ‘డీజే’ అధిగమించింది. దేశవ్యాప్తంగానే కాకుండా అమెరికాలో కూడా ‘డీజే’ సల్మాన్ సినిమా వసూళ్లను దాటింది.
‘ట్యూబ్‌లైట్’ దేశవ్యాప్తంగా దాదాపు 4350 స్క్రీన్లపై విడుదలైంది. ‘డీజే’ను సాధారణంగానే 1000 నుంచి 1200 స్క్రీన్లపై ప్రదర్శించారు. ‘ట్యూబ్‌లైట్’తో పోలిస్తే ‘డీజే’ చాలా తక్కువ స్క్రీన్లపై విడుదలైనప్పటికీ బాక్సాఫీసు వద్ద ముందంజలో నిలవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ‘డీజే’ తొలిరోజున రూ. 24 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ‘ట్యూబ్‌లైట్’ రూ. 21.15 కోట్లు రాబట్టింది. సల్మాన్ సినిమాను ‘డీజే’ బీట్ చేసిందని సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ట్విటర్ ద్వారా వెల్లడించారు.
‘డీజే’కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. కబీర్ ఖాన్ ‘ట్యూబ్‌లైట్’కు దర్శకత్వం వహించారు. సోహైల్ ఖాన్, ఝు ఝు, మాటిన్ రే, ఓంపురి తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. విలక్షణ నటుడు ఓంపురి చివరి సినిమా అని ట్యాగ్ లైన్ పెట్టినా ట్యూబ్ లైట్ వెలగలేదు మరి.