Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్ డౌన్ తర్వాత థియేటర్లలోకి రానున్న కేజీఎఫ్ 2

Advertiesment
లాక్ డౌన్ తర్వాత థియేటర్లలోకి రానున్న కేజీఎఫ్ 2
, సోమవారం, 5 అక్టోబరు 2020 (15:41 IST)
లాక్ డౌన్ తర్వాత కేజీఎఫ్ 2 థియేటర్లలోకి రానుంది. కేజీఎఫ్ ''చాప్టర్-1"ను పాన్ ఇండియా చిత్రంగా కన్నడ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ''కేజీఎఫ్ చాప్టర్-2"పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాప్టర్-1 సాధించిన విజయంతో పెరిగిన అంచనాలకు ధీటుగా దర్శక నిర్మాతలు ''కేజీఎఫ్'' చాప్టర్2ను రాజీ లేకుండా నిర్మిస్తున్నారు. 
 
కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అధీరాగా సంజయ్ దత్ లుక్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా మరోసారి సెట్స్ పైకి వెళ్లనుంది. లాక్ డౌన్ కారణంగా ఏడు నెలల పాటు థియేటర్లు మూత పడి ఉన్నాయి. ఈ నెల 15 నుండి దేశ వ్యాప్తంగా కంటోన్మెంట్ ఏరియాల్లో మినహా మొత్తం ఓపెన్ అవ్వబోతున్నాయి.
 
ఈ నేపథ్యంలో చిన్న బడ్జెట్ సినిమాలు గతంలో విడుదల ఆగిపోయిన సినిమాలు ఇప్పుడు విడుదలకు రెడీ అవుతున్నాయి. వంద కోట్ల బడ్జెట్ సినిమాలు ఏవీ కూడా ఈ మహమ్మారి టైంలో వచ్చేందుకు సిధ్ధంగా లేవు. కేజీఎఫ్ 2 మాత్రం సంక్రాంతికి రావాలని రెడీ అవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓట్స్ క్యారెట్ ఇడ్లీ చేసిన సమంత, సామ్ తనకు ఇన్సిపిరేషన్ అని చెప్పిన ఉపాసన