Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్మిక ఏడుపు.. ఎందుకో తెలుసా?

Advertiesment
రష్మిక ఏడుపు.. ఎందుకో తెలుసా?
, సోమవారం, 22 ఏప్రియల్ 2019 (17:38 IST)
సూపర్ హిట్ సినిమా ఛలోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న క్రేజు ఇప్పుడు చెప్పనక్కర్లేదు. గీత గోవిందంలో విజయ్ దేవరకొండతో నటించిన ఈ భామకు, సినిమా హిట్ కావడంతో క్రేజు మరింత పెరిగింది. దేవదాస్ సినిమా రాణించకపోవడంతో కొంత నిరాశపరిచినా, త్వరలో డియర్ కామ్రేడ్‌తో మరోసారి తెరమీదకు వచ్చి ప్రేక్షకులను అలరించబోతోంది. 
 
గీతగోవిందం సినిమా షూటింగ్‌లో తనకెదురైన సంఘటన గురించి ఇటీవల రష్మిక ఓ ఇంటర్వూలో వెల్లడించింది. ఓ రోజు రష్మిక షూటింగ్ లొకేషన్‌కు ఆలస్యంగా వెళ్లిందట. చిత్ర యూనిట్ సభ్యులెవరూ తనతో మాట్లాడలేదట. అందరూ ముభావంగా ఉండటంతో ఏం జరిగిందో తెలియక కన్నీరు పెట్టుకున్నానని చెప్పింది. ఇంతలో డైరెక్టర్ పరశురామ్ తన దగ్గరకు వచ్చి అసలు విషయం చెప్పి ఓదార్చాడట. 
 
అసలు ఏం జరిగిందంటే. రష్మిక బాధపడుతున్నప్పుడు హావభావాలను న్యాచురల్‌గా క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసి ఆటపట్టించామని చెప్పాడట. పరశురామ్ ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ను సినిమాలో ఎక్కడ పెట్టారో రష్మిక చెప్పలేదు. అది చెప్తే సినీ అభిమానులు మళ్లీ చూసి ఆనందిస్తారుగా...!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళయిన తర్వాత కూడా నా భర్త అఫైర్ కొనసాగింది : పూనమ్ సిన్హా