'జబర్దస్త్' సుధీర్‌తో లవ్ ఎఫైర్ ఉన్నట్టు ప్రచారం చేయమంటున్న రష్మి.. కారణమేంటో?
ప్రముఖ తెలుగు చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్, బుల్లితెర యాంకర్ రష్మీలు బాగా పాపులర్ అయ్యారు. అదేసమయంలో వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్టు ఎంతోకాలంగా గుసగుసలు వినిప
ప్రముఖ తెలుగు చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్, బుల్లితెర యాంకర్ రష్మిలు బాగా పాపులర్ అయ్యారు. అదేసమయంలో వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్టు ఎంతోకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సుధీర్‌కు రష్మి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్‌తో సుధీర్ మాత్రమే కాదు.. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు.
ఇంతలోనే రష్మి మాట మార్చింది. 'సుధీర్‌తో లవ్ ఎఫైర్ ఉందో, లేదో నేను చెప్పను. సుధీర్‌తో లవ్ ఎఫైర్ గురించి మాత్రం బాగా ప్రచారం చేయండి. బాగా రాయండి. ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ఆ విధంగానైనా ట్రెండ్ అవడం మంచిదే. నాకు ఇలాంటి వాటితో ఇబ్బందులేమీ లేవు. నా లవ్‌ఎఫైర్ గురించే మాట్లాడుకోండి' అంటూ స్పందించింది.
ఇకపోతే... యాంకర్ అనసూయతో గొడవ గురించి స్పందిస్తూ ‘అనసూయతో నాకు ఎలాంటి గొడవలూ లేవు. మేమిద్దరం మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలం. మా లక్ష్యాలు వేరు.. మార్గాలు వేరు’ అని, మా ఇద్దరి జరిగే చిన్న విషయాలను మీడియా బూతద్దంలో చూపరాదని కోరింది.