Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరణ్ జొహార్‌కు బాలీవుడ్ ప్రముఖుల సపోర్టు.. ముదురుతున్న 'ఏ దిల్ హై ముష్కిల్' వివాదం

తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ 'ఏ దిల్ హై ముష్కిల్'ను మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత అమేయ్ ఖోప్కర్ హెచ్చరించారు.

Advertiesment
కరణ్ జొహార్‌కు బాలీవుడ్ ప్రముఖుల సపోర్టు.. ముదురుతున్న 'ఏ దిల్ హై ముష్కిల్' వివాదం
, శుక్రవారం, 21 అక్టోబరు 2016 (12:35 IST)
తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ 'ఏ దిల్ హై ముష్కిల్'ను మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత అమేయ్ ఖోప్కర్ హెచ్చరించారు. దీనికి ప్రతిగా పాకిస్థాన్ నటులు నటించిన ఈ సినిమాను ప్రదర్శించినా, ఈ సినిమాకు వ్యతిరేకంగా తాము నిర్వహించే ప్రదర్శనను అడ్డుకోవాలని ప్రయత్నించినా, సినిమా ప్రదర్శన ఆపేందుకు తమ కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నా తీవ్ర పరిణామాలు తప్పవని చిత్ర యూనిట్ వర్గాలతో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రతి హెచ్చరిక చేశారు. దీంతో ఈ చిత్రంపై వివాదం రాజుకుంది. పైగా, ఈ చిత్ర పంచాయతీ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వద్దకు కూడా చేరింది.
 
ఈ సినిమా విడుదల విషయంలో బాలీవుడ్ ప్రముఖులు దర్శకుడు, నిర్మాత కరణ్ జొహార్ పక్షాన నిలిచారు. అయితే నాలుగు రాష్ట్రాల్లోని సింగిల్ థియేటర్ ఓనర్లు మాత్రం ఈ సినిమాను ప్రదర్శించబోమని ఓ తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకురాలు జోయ అక్తర్ 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాకు మద్దతు తెలిపారు. 
 
ఈ సినిమా విషయంలో వివాదం రేగడం దురదృష్టకరమని అన్నారు. ఈ సినిమా దర్శకుడు కరణ్ ఎలాంటి తప్పుచేయలేదని, ఈ సినిమా విషయంలో ఆయన ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని చెప్పారు. భారత్-పాకిస్థాన్ సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా షూటింగ్ చేశాడని వెల్లడించారు.
 
సినిమా విడుదల సమయానికి పరిస్థితులు మారిపోవడంతో అతడిపై దాడి చేస్తున్నారని వాపోయారు. దీనిపై బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ కూడా తనదైనశైలిలో స్పందించారు. పాకిస్థాన్ నటీనటులకు కేంద్ర ప్రభుత్వమే వీసాలు మంజూరు చేసిందని గుర్తుచేశారు. పాక్ కళాకారులు ఇక్కడ చట్టబద్దంగానే పనిచేస్తున్నారని చెప్పారు. ఏ సినిమా చూడాలో, చూడకూడదో ఎంచుకునే స్వేచ్ఛ ప్రేక్షకులకు ఉందని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ‌ధాని అమ‌రావ‌తి అనువుగా క‌డితే... సినిమా షూటింగులూ అక్క‌డే : దాస‌రి