Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

మళ్ళీ పెళ్లి నుంచి రారా హుస్సూర్ నాతో పాట విడుదల

Advertiesment
Naresh VK, Pavitra Lokesh
, శుక్రవారం, 5 మే 2023 (17:36 IST)
Naresh VK, Pavitra Lokesh
డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ 'మళ్ళీ పెళ్లి' హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ కథానాయిక.  మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన  దర్శకత్వం వహిస్తున్నారు.  విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మళ్లీ పెళ్లి మే 26న విడుదల కానుంది.
 
ఫస్ట్ లుక్,  గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి రారా హుస్సూర్ నాతో పాటని విడుదల చేశారు. ఆరుళ్ ఈ పాటని రొమాంటిక్ మెలోడీ గా కంపోజ్ చేశారు. ఇందు సనత్ లవ్లీ అలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం అదనపు ఆకర్షణ తెచ్చింది. ఈ పాటలో నరేష్, పవిత్ర లోకేష్ ల లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.
 
సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.
 
జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బహు భాషా చిత్రం భారతీయన్స్ టీజర్ సూపర్ గా ఉందన్న డి.సురేష్ బాబు