ఛాన్సుల పేరుతో మోడల్ శీలాన్ని కాటేసిన నిర్మాత

శనివారం, 5 జనవరి 2019 (09:35 IST)
మరో మోడల్ సిని నిర్మాత చేతిలో మోసపోయింది. సినీ అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి మోడల్‌పై నిర్మాత అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన వర్ధమాన సినీ నటి ఒకరు సినీ అవకాశాల కోసం ఓ నిర్మాత వైశాక్ రాజన్‌ను సంప్రదించింది. ఈమెను 2017లో ఆ నిర్మాత ఎర్నాకుళంలోని కత్రికదావులో ఉన్న ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లి తన కామవాంఛ తీర్చుకున్నాడు. 
 
ఆ తర్వాత సినీ ఛాన్సులు ఇప్పించకపోగా ఆమెను నిరంతరం వేధించసాగాడు. దీంతో విసుగుచెందిన ఆ మోడల్.. నిర్మాతపై ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిర్మాత వద్ద విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, నిర్మాత వైశాక్.. తన పేరుమీదే అంటే వైశాక సినిమా పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈయన గత 2012 నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఈయన 'రోల్ మోడల్స్', 'ఛంక్జ్', 'వెల్కమ్ టు సెంట్రల్ జైల్', 'పద్మశ్రీ భారత్ డాక్టర్ సరోజ్ కుమార్' వంటి పలు చిత్రాలను నిర్మించారు. ఈయన చివరగా 'జానీ జానీ యస్ అప్పా' అనే చిత్రాన్ని తీశాడు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నాగార్జున కొత్త సినిమాని ప్ర‌క‌టించేది ఎప్పుడు..?