Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హ‌నుమంతుని నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న ర‌ణ‌మండ‌ల‌

Ranmandala poster

డీవీ

, సోమవారం, 28 అక్టోబరు 2024 (15:18 IST)
Ranmandala poster
పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై పీ ఎమ్ ఎఫ్ - 46వ చిత్రానికి స‌న్నా‌హాలు మొద‌లైయ్యాయి. భారీ యాక్ష‌న్ డివోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. హ‌నుమంతుని నేప‌థ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో వీ ఎఫ్ ఎక్స్, యాక్ష‌న్, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు కీల‌కంగా ఉండ‌నున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌, ఆదోని ర‌ణ‌మండ‌ల దేవాల‌యంలో అట్ట‌హాసంగా జ‌రిగింది. 
 
ర‌ణ‌మండ‌ల ఆంజ‌నేయుని స‌న్నిథానంలో వేద పండితుల ఆశీర్వ‌చ‌నాల‌తో నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ గారు స‌మ‌క్షంలో ర‌ణ‌మండల చిత్రం టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో పాటు, ఫ‌స్ట్ లుక్  కూడా విడుద‌లైంది. ర‌ణ‌మండ‌ల ఆంజ‌నేయ‌ని దేవాల‌య క్షేత్ర నామాన్నే ఈ చిత్రానికి టైటిల్ గా పెట్ట‌డం విశేషం. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివ‌రాలు త‌ర్వ‌లోనే అధికారికంగా విడుద‌లవుతాయి.
 
నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ త‌న స్వ‌స్థ‌లం ఆదోనిలో సినిమాలు షూటింగ్ చేయాల‌నే ఎప్ప‌టినుంచో స‌న్నాహాలు చేస్తున్న‌ప్ప‌టికీ స‌రైన స‌మ‌యం, క‌థ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వ‌చ్చింద‌ని, అయితే ర‌ణ‌మండ‌ల క‌థ 2022 నుంచే సిద్ధం చేస్తున్నామ‌ని, పూర్తిగా ఆదోని ప‌రిస‌ర ప్రాంతాల్లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జ‌రుగుతుంద‌ని చెప్పారు. 
 
అలానే ఈ చిత్రానికి సంబంధించిన న‌టీన‌టులు వివ‌రాల‌తో పాటు, టెక్నీష‌య‌న్ల వివ‌రాలు త్వ‌ర‌లోనే అఫీష‌య‌ల్ గా ఎనౌన్స్ మెంట్ చేస్తామ‌ని తెలిపారు. ర‌ణ‌మండ‌ల ఆంజ‌నేయ‌ని స‌న్నిధిలో ర‌ణ‌మండ‌ల టైటిల్ ఎనౌన్స్ మెంట్ జ‌ర‌గ‌డం త‌న‌కు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని, న‌వంబ‌ర్ లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నుంచి రానున్న  పీ ఎమ్ ఎఫ్ 47వ చిత్రాన్ని కూడా ఆదోనిలోనే పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించి, ప‌రిస‌ర ప్రాంతాల్లోనే షూటింగ్ నిర్వ‌హించే విధంగా స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా తెలిపారు. మొత్తంగా రెండు చిత్రాల్ని ఆదోనిలో ప్రారంభించి షూటింగ్ పూర్తి చేసి విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా వివ‌రించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సవాల్‌గా తీసుకుని అమ్మ స్ఫూర్తితో పాత్రలో నటించాను: మీనాక్షి చౌదరి