మెగాస్టార్ చిరంజీవికి 2024 సంవత్సరం ఒక మెమరబుల్ ఇయర్‌గా మిగిలిపోనుంది. ఆయన నటించిన చిత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా విడుదలకాలేదు. కానీ, ఆయనకు చిరస్మరణీయమైన చిత్రంగా నిలిచిపోనుంది. దీనికి కొన్ని కారణాలు లేకపోలేదు. ఇలాంటి వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే,
ఈ ఏడాది చిరంజీవి నుంచి ఎలాంటి సినిమా రిలీజ్ కాకపోయినప్పటికీ నటుడిగా అనేక మైలురాళ్లు ఆయన సొంతమయ్యాయి. పద్మ విభూషణ్.. దేశంలో రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. 24 వేలకు పైగా డాన్స్ మూమెంట్స్ చేసిన నటుడిగా గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. రంగస్థంలంపై నటించిన యాభై ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న విషయాన్ని ఇటీవలే ఆయన స్వయంగా ప్రస్తావించారు.
నటుడిగా ఎంతో ఇష్టపడే ఏఎన్నార్ శతజయంతి సందర్భంలో ఏఎన్నార్ జాతీయ పురస్కారాన్ని పొందనున్నారు. అన్నింటినీ మించి ఆయన ఎంతగానో ఆశించిన అంశం.. రాజకీయంగా పవన్ కల్యాణ్ ఉన్నత స్థానంలో ఉండటం. ఇలా ఈ ఏడాది చిరంజీవికి ఆయన జీవితంలో మరుపురాని మధురమైన సంవత్సరంగా 2024 నిలువనుంది.