Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోబో 2లో రమ్యకృష్ణ: నీలంబరిగా మళ్లీ రోబో రజనీకి చుక్కలు చూపిస్తుందా?

రోబో 2లో రమ్యకృష్ణ: నీలంబరిగా మళ్లీ రోబో రజనీకి చుక్కలు చూపిస్తుందా?
, మంగళవారం, 7 జూన్ 2016 (16:22 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నరసింహ సినిమాలో విభిన్న క్యారెక్టర్‌లో నటించిన రమ్యకృష్ణ.. మళ్లీ రజినీ కాంత్‌ సినిమాలో నటించనుంది. బాహుబలి, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ అదరగొట్టేస్తున్న రమ్యకృష్ణ.. రోబో2లో కనిపించనుందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నరసింహలో నీలంబరిగా రజనీకి విలన్‌గా నటించి అదరగొట్టేసిన రమ్యకృష్ణ రోబో2లో ఎలాంటి రోల్‌లో కనిపించనుందనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 
 
త్వరలో ‘కబాలి’గా రానున్న రజనీ కాంత్ ‘రోబో 2.0’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2010లో వచ్చిన ‘రోబో’కి సీక్వెల్‌‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రకు రమ్యకృష్ణను సంప్రదించినట్లు తెలిసింది. రమ్య కూడా అందుకు సానుకూలంగా స్పందించడంతో.. త్వరలోనే రజనీ-రమ్యకృష్ణలపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియాలో క్లీవేజ్‌ షో.. చేతిలో అరడజను సినిమాలు.. చిరుత హీరోయిన్ రెచ్చిపోతుందా?