Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా రామ్ నగర్ బన్నీ, గ్లింప్స్ విడుదల చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్

Chandrahas,  Speaker Gaddam Prasad, prabhakar and family

డీవీ

, సోమవారం, 9 సెప్టెంబరు 2024 (10:36 IST)
Chandrahas, Speaker Gaddam Prasad, prabhakar and family
ఆటిట్యూడ్ స్టార్ గా పేరుపొందిన చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "రామ్ నగర్ బన్నీ". విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ లో "రామ్ నగర్ బన్నీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రామానాయుడు స్టూడియోలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయి గ్లిమ్ప్స్ విడుదల చేసారు.  ఈ కార్యక్రమంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు ఆర్థిక సహాయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి అందజేశారు హీరో చంద్రహాస్.
 
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ - ప్రభాకర్ నాకు సుపరిచితులు. ఆయన రామ్ నగర్ బన్నీ సినిమా గురించి చెప్పి నన్ను ఇన్వైట్ చేశారు. ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. చంద్రహాస్ మా అమ్మాయి క్లాస్ మేట్. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రహాస్ తన వంతు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. మొదటి సినిమాకు హీరోలు అంతగా ఆకట్టుకోరు. కానీ చంద్రహాస్ బాగున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు. అతన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా. అలాగే కుటుంబ సభ్యులు ఆయన ఎలా ఎదగాలని కోరుకుంటున్నారో ఆ స్థాయికి చంద్రహాస్ చేరుకోవాలని బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.
 
చంద్రహాస్ మాట్లాడుతూ, నేను సినిమాల్లో ఒకలా, బయట మరొకలా బిహేవ్ చేయను. నా మనసులో ఏముందో అదే మాట్లాడుతుంటా. అది కొందరికి నచ్చలేదు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారాను.  ఫస్ట్ మూవీగా రామ్ నగర్ బన్నీ మీ ముందుకు రాబోతోంది. నెక్ట్ మంత్ అక్టోబర్ లోనే మా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇక నుంచి రెగ్యులర్ గా మా మూవీ అప్డేట్స్ ఇస్తాం. అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ఒక ఫ్లోలో వెళ్తుంటుంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది. రామ్ నగర్ బన్నీ అనేది ఏ భాషలో సినిమా రిలీజ్ చేసినా కనెక్ట్ అయ్యే టైటిల్. ప్రజల్ని ఎంటర్ టైన్ చేయాలని ఎలా అనిపించిందో వాళ్లు వరద బాధల్లో ఉన్నప్పుడు కూడా నా వంతుగా సాయం చేసి వాళ్లకు సంతోషాన్ని పంచాలని అనిపించింది. అందుకే నా కొద్దిపాటి సంపాదనలో వీలైనంత తెలంగాణ, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా కలెక్షన్స్ లో 10 శాతం కూడా వరద బాధితుల సహాయార్థం అందిస్తాం. ఇప్పుడే కాదు భవిష్యత్ లోనూ నాకు వీలైనంత సహాయాన్ని సొసైటీ కోసం చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి చిత్రం పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి