Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎవరైనా కత్తితో పొడిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆస్వాదిస్తా : వర్మ

Advertiesment
ramgopal varma
, శుక్రవారం, 13 మే 2022 (15:46 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది మాట్లాడినా.. ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎవరైనా తనను కత్తితో పొడిచేందుకు వస్తే తాను పారిపోనని, కత్తితో పొడిస్తే కలిగే ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆస్వాదించి చచ్చిపోతానని చెప్పారు. 
 
తాజాగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ పౌరుడుగా రాజ్యాంగంలో తనకున్న హక్కులేంటో బాగా తెలుసని, అందుకనే వాటిని బాగా వినియోగించుకుంటున్నట్టు చెప్పారు. ఎదుటి వాళ్లు బాధపడతారని మాట్లాడకుండా ఉంటే అసలు ఏం మాట్లాడలేమన్నారు. టిక్కెట్ల ధరల పెంపు విషయంలో కేవలం ప్రజలకు మధ్యవర్తిగానే మంత్రిని కలిశానని పేర్కొన్నారు. మనం చెప్పిన నిర్ణయం కొందరికి నచ్చుతుంది.. మరికొందరికి నచ్చకపోవచ్చన్నారు. 
 
అదేసమయంలో తనలాగా జీవించాలంటే మూడు విషయాలను అలవర్చుకోవాలన్నారు. అందులో ఒకటి దేవుడు, సమాజం, కుటుంబం వంటి వాటిని వదిలివేయాలని చెప్పారు. అపుడు వచ్చే స్వేచ్ఛతో తనలాగా బతకవచ్చన్నారు. ఈ మధ్యవచ్చిన చిత్రాల్లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కశ్మీరీ ఫైల్స్ బాగా నచ్చాయన చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్వతీశం, ఐశ్వర్య జంటగా సందేశాత్మ‌క చిత్రం