Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాంగోపాల్ వర్మ సెక్సియస్ట్ ట్వీట్ : గోవాలో కేసు నమోదు.. ఖాతా క్లోజ్ చేయాలంటూ డిమాండ్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మహిళా దినోత్సవం రోజున చేసిన ట్వీట్ రచ్చరచ్చగా మారింది. ఈ ట్వీట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. పురుషులు అందరి తరపున మహిళలకు పురుష ది

Advertiesment
రాంగోపాల్ వర్మ సెక్సియస్ట్ ట్వీట్ : గోవాలో కేసు నమోదు.. ఖాతా క్లోజ్ చేయాలంటూ డిమాండ్
, గురువారం, 9 మార్చి 2017 (10:47 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మహిళా దినోత్సవం రోజున చేసిన ట్వీట్ రచ్చరచ్చగా మారింది. ఈ ట్వీట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. పురుషులు అందరి తరపున మహిళలకు పురుష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కనీసం ఈ రోజైనా మహిళలు మగవాళ్లను సాధించకుండా స్వేచ్ఛ ఇవ్వాలి. పురుషులు ఇచ్చే స్వేచ్ఛను మహిళలు ఇవ్వలేరు. సన్నీ లియోన్ ఇచ్చేంతటి ఆనందాన్ని పురుషులకు స్త్రీలు ఇవ్వాలని ప్రపంచంలోని మహిళలందరినీ కోరుతున్నాను అని ట్వీట్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో పెను దుమారాన్నే సృష్టించాయి. 
 
దీనిపై గోవాలో విశాఖ మాంబ్రే అనే మహిళా సామాజిక కార్యకర్త ఫిర్యాదు దాఖలు చేశారు. గోవాలోని పనాజి పోలీసు స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఆయన చీప్ పబ్లిసిటీ కోసం అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని, మహిళలను కించపరిచాడనివిశాఖ మాంబ్రె, పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ట్విట్టర్‌లో వర్మ నిర్వహిస్తున్న అన్ని ఖాతాలనూ మూసి వేయాలని ఈ సందర్భంగా ఆమె పోలీసులను కోరారు. కాగా, గతంలోనూ ఆయన పెట్టిన ట్వీట్లపై పలు కేసులు విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత్రల్లాగే పేరు ప్రతిష్టలూ కల్పనే.. శాశ్వతమనుకుంటే అడ్రస్ లేకుండా పోతారు: సమంత