Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

`సైరా న‌ర‌సింహారెడ్డి`ని నిర్మించడం ప్రెస్టీజియస్‌గా ఫీల్‌ అవుతున్నా - మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో.. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో.. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన తారాగణంగా మెగాపవర్‌స్టార్

`సైరా న‌ర‌సింహారెడ్డి`ని నిర్మించడం ప్రెస్టీజియస్‌గా ఫీల్‌ అవుతున్నా - మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌
, మంగళవారం, 21 ఆగస్టు 2018 (22:57 IST)
మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో.. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో.. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన తారాగణంగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్‌తో చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఆగస్ట్‌ 22న మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉదయం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో టీజర్‌ను విడుదల చేశారు. చిరంజీవి అమ్మగారు అంజనాదేవి, చరణ్‌ అమ్మగారు సురేఖ ఈ టీజర్‌ను విడుదల చేశారు. 
 
అంజనాదేవి మాట్లాడుతూ - ''అదిరిపోయింది. చాలా బావుంది'' అన్నారు. చిత్ర సమర్పకురాలు శ్రీమతి సురేఖ కొణిదెల మాట్లాడుతూ - ''చాలా చాలా బావుంది. మాటలు సరిపోవు. చూడ్డానికి చాలా బావుంది. సురేందర్‌రెడ్డికి థాంక్స్‌. చాలా బాగా తీశారు. చాలా బావుంది'' అన్నారు. చిత్ర నిర్మాత, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మాట్లాడుతూ - ''సైరాని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం. అయితే అందరిలో సైరాలో ఏముంది? అసలు నరసింహారెడ్డి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవడానికి ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. 
 
కాబట్టి నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేద్దామని నిర్ణయించుకున్నాం. చాలా పాజిటివ్‌ రెస్పాన్స్‌ మా టీమ్‌కి వచ్చింది. బహుశా 12 ఏళ్ల క్రితం పరుచూరి బ్రదర్స్‌ ఈ కథ చెప్పారు. అప్పటి నుంచి ప్రతి ఏడాదీ మా ఇంటికి వచ్చినప్పుడు 'నాన్నగారితో సైరా గురించి చెప్పు' అనేవారు. వాళ్లు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అయినా నేను చెప్పడమేంటండీ అని అనేవాడిని. కథ బిల్డప్‌ కారణంగానో, టెక్నికల్‌ ల్యాక్‌ కారణంగానో ఎందుకు డిలే అయిందో తెలియదు. ఇప్పటికి ఓకే అయింది. ఇప్పటికైనా ఓకే అయిందంటే దానికి ముఖ్య కారణం పరుచూరి సోదరులు. వారి గట్ట నమ్మకం, సంకల్పమే ఈ సినిమాను ఇవాళ కార్యరూపం చేయించింది. 12 ఏళ్లుగా వాళ్లు సాధన, మెడిటేషన్‌ చేస్తే వచ్చింది. ఒక వ్యక్తి ఒక విషయం మీద అలాగే కూర్చుంటే ఏదైనా సాధ్యం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 
 
సూరిగారితో ధ్రువ నుంచి ట్రావెల్‌ అవుతున్నాం. చాలా ఎంజాయ్‌ చేశాం. సూరిగారి కూడా వేరే వేరే కథలు వెతుకుతూ ఉన్నప్పుడు నేను పరుచూరి సోదరులను ఒకసారి కలవండి సార్‌. ఇలా ఉంది అని అన్నాను. కథ విన్నారు. నాన్నగారితో మీరు చేస్తే బావుంటుందనగానే మామూలుగా ఏ డైరక్టర్‌ అయినా వెంటనే గెంతేసేవారు. కానీ సురేందర్‌రెడ్డిగారు కాస్త టైమ్‌ తీసుకుని, నాన్నగారితో సినిమా అంటే ఎంత బాధ్యత ఉంటుందో ఊహించుకుని ఈ సినిమాకు అంగీకారం తెలిపారు. కథ విని, ఆయన శైలికి అర్థం చేసుకుని నాన్నగారిని కలిశారు. 12ఏళ్లుగా నానుస్తున్న విషయాన్ని నాన్నగారు ఒక్క సిట్టింగ్‌తో ఓకే చేసేశారు. రత్నవేలుగారు ఖైదీ నెంబర్‌ 150, రంగస్థలం, ఇప్పుడు సైరా.. ఆయనకు హిట్లు కొత్త కాదు. ఆయన విజువల్స్‌ మామూలుగా ఉండవు. లీగారు బాహుబలి 2 లోనూ పనిచేశారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌ లో ఉండటం చాలా ఆనందంగా ఉంది. 
 
కమల్‌ కణ్ణన్‌గారు మగధీరకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ చేశారు. అప్పటి నుంచి నాకు తెలుసు. సాయిగారు ఇంతకు ముందు కూడా మాతో పనిచేశారు. అమిత్‌ త్రివేదిగారి మ్యూజిక్‌ కి నేను పెద్ద ఫ్యాన్‌. ఇండియలో నెక్స్ట్‌ బిగ్గెస్ట్‌ మ్యూజిషియన్‌ అని అంటున్నారు. ఇన్నేళ్లలో నాన్నగారు ఒక ట్యూన్‌ని వినగానే ఓకే చేయడం అనేది ఎప్పుడూ లేదు. అదే అమిత్‌గారు క్లైమాక్స్‌ సాంగ్‌ ఇందాకే పంపారు. నాన్నగారు వినగానే ఓకే చేసేశారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఓ హిందీ వ్యక్తి మన తెలుగుదనాన్ని అర్థం చేసుకుని మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. చిన్న టీజర్‌లోనే అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. అలాగే అమితాబ్‌గారు, నయనతార, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, తమన్నా, జగపతిబాబుగారికి ధన్యవాదాలు. 
 
ఈ సినిమాను దక్షిణాది భాషలన్నింటిలోనూ విడుదల చేస్తున్నాం. బడ్జెట్‌ గురించి ఆలోచించడం లేదు. డాడీ డ్రీమ్‌ప్రాజెక్ట్‌ కాబట్టి వెనకా ముందూ చూడకుండా, దేనికీ వెనకాడకుండా తీస్తున్నాం. ఎక్కువగానే పెట్టి చేస్తున్నాం. నాకైతే ప్రాఫిట్స్‌ వస్తే బోనస్‌. రాకపోయినా ఆనందమే. ఖర్చును, మరోదాన్ని ద ష్టిలో పెట్టుకోకుండా చేస్తున్నాం. ఇలాంటి మూవీ చేస్తున్నందకు ప్రెస్టీజియస్‌గా, ఫ్రౌడ్‌గా ఫీల్‌ అవుతున్నాను. నాన్నగారు 'కొదమసింహం' గుర్రంపై చేసిన ఫీట్‌ చూసే నేను గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. ఇక ఈ ట్రైలర్స్‌లో కొన్ని జంతువులు ఉన్నాయి. కాబట్టి టీజర్‌ను థియేటర్స్‌లో ప్రదర్శించడానికి జంతు సంరక్షణ సంస్థను అప్లై చేశాం. రెండు వారాల్లో టీజర్‌ను థియేటర్స్‌లో ప్రదర్శిస్తాం'' అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండకు ముద్దులు పెడుతున్న అమ్మాయిలు.. ఎక్కడ..?