Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎట్టేకేలకు విహార యాత్రలో చెర్రీ - ఉపాసన - పిక్ వైరల్

Advertiesment
ఎట్టేకేలకు విహార యాత్రలో చెర్రీ - ఉపాసన - పిక్ వైరల్
, సోమవారం, 7 మార్చి 2022 (11:00 IST)
టాలీవుడ్ కపుల్స్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ఎట్టకేలకు విహారయాత్రకు వెళ్లారు. అదీకూడా రెండేళ్ల తర్వాత. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా వారిద్దరూ ఎలాంటి వెకేషన్స్‌కు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వారిద్దరూ విహార యాత్రకు వెళుతూ విమానంలో దిగిన ఫోటోను ఉపాసన కొణిదెల తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పిక్ ఇపుడు వైరల్ అయింది. 
 
తమ ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణిస్తున్న పిక్‌ను ఉపాసన షేర్ చేశారు. "చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మూడో‌లో.. ధన్యవాదాలు మిస్టర్ సి" అంటూ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలో చరణ్ ముఖానికి మాస్క్ ధరించి తన ఫేస్ లుక్‌ను కవర్ చేయడం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. "ఆర్సీ15" మేకోవర్‌ను రివీల్ చేయకుండా ఉండటానికే ఆయనలా చేసివుండొచ్చని మెగాఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"డీజే టిల్లు" బ్యూటీకి లక్కీ ఛాన్స్.. బన్నీతో స్క్రీన్ షేరింగ్