Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ అవకాశాల కోసం కొందరు ఏమైనా చేస్తారేమో?: శ్రీరెడ్డికి రకుల్ కౌంటర్

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసనపై ఇప్పటికే మా అసోసియేషన్ మండిపడింది. సభ్యసమాజం తలదించుకునేలా బహిరంగంగా బట్టలిప్పేసిన శ్రీరెడ్డిపై సినీ నటి హేమ మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ప్రోత

Advertiesment
సినీ అవకాశాల కోసం కొందరు ఏమైనా చేస్తారేమో?: శ్రీరెడ్డికి రకుల్ కౌంటర్
, మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (11:46 IST)
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసనపై ఇప్పటికే మా అసోసియేషన్ మండిపడింది. సభ్యసమాజం తలదించుకునేలా బహిరంగంగా బట్టలిప్పేసిన శ్రీరెడ్డిపై సినీ నటి హేమ మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ప్రోత్సహించవద్దని మీడియాను హేమ కోరారు.

అలాగే మా సభ్యత్వం ఆమెకు ఇచ్చేదిలేదని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముందునుంచి శ్రీరెడ్డి కామెంట్స్‌పై మండిపడుతూ వచ్చిన అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసనపై కౌంటర్ ఇచ్చింది. 
 
సినిమాల్లో అవకాశాల కోసం కొందరు ఏమైనా చేస్తారేమో? కానీ తాను మాత్రం అలా చేయనని రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది. కాస్టింగ్ కౌచ్‌పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని తెలిపింది. తాను కేవలం తన గురించి మాత్రమే మాట్లాడగలనని చెప్పింది. తనకు ఇంతవరకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. 
 
అమ్మాయి కోసం సినిమా తీయరని.. ప్రతిభకే గుర్తింపు వుంటుందని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. సినీ పరిశ్రమలో వచ్చే ఎంట్రీ ఇచ్చే అమ్మాయిలకు చెప్పేదేమిటంటే.. అవకాశాల పేరుతో అడ్వాంటేజ్ తీసుకునేందుకు చాలామంది ఎదురుచూస్తుంటారు.

అయితే వారు కోరుకునేది ఇవ్వాలా? వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది మహిళలేనని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. సరైన అవకాశం లభించేందుకు సమయం పడుతుందని.. ఓపిగ్గా ఎదురుచూడాలని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో క‌ళ్యాణ్ రామ్.. క్యారెక్ట‌ర్ ఏంటో తెలుసా?